బడ్జెట్‌ అంతా మోసం.. చెవిలో పువ్వులు పెట్టుకుని.. | BRS MLAs Walkout From Telangana Assembly | Sakshi
Sakshi News home page

బడ్జెట్‌ అంతా మోసం.. చెవిలో పువ్వులు పెట్టుకుని..

Mar 20 2026 2:28 PM | Updated on Mar 20 2026 3:25 PM

BRS MLAs Walkout From Telangana Assembly

 

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ అసెంబ్లీ నుంచి బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు వాకౌట్‌ చేశారు. బడ్జెట్ అంతా మోసం అంటూ చెవులకు పువ్వులు పెట్టుకుని అసెంబ్లీ ఎంట్రీ మెట్ల వద్ద నిరసన చేపట్టారు. బీసీ, ఎస్సీ సబ్ ప్లాన్‌లు మోసం మోసం అంటూ నినాదాలు చేశారు.

ఆరు గ్యారెంటీలు మోసం మోసం అంటూ నినాదాలు.. 420 హామీలు మోసం మోసం. ఉద్యోగులకు సీఆర్‌సీ మోసం మోసం.. మహిళలకు మోసం.. మోసం’’ అంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క బడ్జెట్ ప్రసంగం ప్రారంభించగానే బీఆర్ఎస్ సభ్యులు నిరసన చేపట్టారు. బడ్జెట్‌ ప్రవేశపెట్టే ముందు కూడా నిరసనకు దిగిన బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు..  ప్రభుత్వం హామీలను విస్మరించిందంటూ నినాదాలు చేశారు.

బడ్జెట్ అంతా డొల్లే కాంగ్రెస్ పై BRS ఎమ్మెల్యేల ఫైర్

Advertisement
 
Advertisement
Advertisement