సభను తప్పుదోవ పట్టిస్తే మేము ఊరుకోవాలా? భట్టి | Telangana assembly sessions 4th day important updates | Sakshi
Sakshi News home page

Updates: సభను తప్పుదోవ పట్టిస్తే మేము ఊరుకోవాలా? భట్టి

Mar 23 2026 11:12 AM | Updated on Mar 23 2026 5:23 PM

Telangana assembly sessions 4th day important updates

అసెంబ్లీ సమావేశాల అప్‌డేట్స్‌

హరీష్ రావు చెప్పిన లెక్కలు తప్పు: భట్టి 
హరీష్ రావు మాట్లాడుతుంటే తమ వైపు నుంచి ఎవరూ అడ్డుపడలేదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ‘హరీష్ రావు సభను తప్పుదోవ పట్టిస్తే మేము ఊరుకోవాలా? హరీష్ రావు చెప్పిన స్టాంప్ డ్యూటీ లెక్కలు తప్పు. మున్సిపాలిటీల ఖాతాలో పడాల్సిన డబ్బులను స్టాంప్ డ్యూటీగా హరీష్ రావు తప్పుడు ఆరోపణ చేశారు. సభను ఇంత సమయం వాయిదా ఎలా వేస్తారని తలసాని అడగడం ఆశ్చర్యంగా ఉంది’ అని చెప్పారు. 

రేవంత్ రెడ్డితో ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి భేటీ
అసెంబ్లీలోని సీఎం ఛాంబర్‌లో సీఎం రేవంత్ రెడ్డితో ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి సమావేశమయ్యారు. గత కొన్ని రోజులుగా మంత్రి పదవి విషయంలో సీఎం రేవంత్ రెడ్డిపై రాజగోపాల్ రెడ్డి పరోక్షంగా విమర్శలు చేసిన విషయం తెలిసిందే.

మండలి రేపటికి వాయిదా 
తెలంగాణ శాసనమండలి రేపటికి వాయిదా పడింది. మళ్లీ రేపు ఉదయం సమావేశాలు ప్రారంభం కానున్నాయి.

రైతు బంధు ఎగ్గొట్టారు: హరీష్‌రావు 
కాంగ్రెస్‌ మేనిఫెస్టోలో ప్రతి ఎకరాకు రూ.15 వేలు ఇస్తామని హామీ ఇచ్చాని, ఇప్పుడు రూ.12 వేలు ఇస్తామని బడ్జెట్‌లో చెబుతున్నారని మాజీ మంత్రి హరీష్‌రావు అన్నారు. ‘ఈ ప్రభుత్వం రూ.19 వేల కోట్ల రైతు బంధు ఎగ్గొట్టింది. రాష్ట్రమంతా రైతు రుణమాఫీ అమలు కాలేదు. రైతుల పాలిట అభయ హస్తం భస్మాసుర హస్తంగా మారింది. రైతు రుణమాఫీ కోసం అన్నదాతలు ఎదురుచూస్తున్నారు. ఏ నియోజక వర్గంలో చూసినా ఇదే పరిస్థితి నెలకొంది. రుణమాఫీ అమలు పూర్తయిపోయిందని ప్రభుత్వం చెబుతోంది. 
ఏ గ్రామం వెళ్లినా తమకు రుణమాఫీ కాలేదని రైతులు చెబుతున్నారు. ఆత్మహత్యలు ఆగాలని కేసీఆర్‌ రైతు బంధును ప్రవేశపెట్టారు. ఎన్ని విపత్తులు వచ్చినా రైతు బంధును కేసీఆర్‌ ఆపలేదు. మేము ఒక్క సీజన్‌ కూడా రైతు బంధును ఎగ్గొట్టలేదు’ అని హరీష్‌ రావు చెప్పారు. 

బీఆర్ఎస్ వాకౌట్‌
తెలంగాణ శాసనసభ నుంచి బీఆర్ఎస్ పార్టీ స‌భ్యులు వాకౌట్ చేశారు. రిటైర్డ్ ఉద్యోగుల బెనిఫిట్స్ పై ప్రభుత్వం సరైన సమాధానం చెప్పనందుకు నిరసనగా స‌భ నుంచి బ‌య‌ట‌కు వెళ్లిపోయారు. 

టెండర్ ఇవ్వకపోతే స్కామ్ అని అంటారా?: మండిపడిన మంత్రి

  • ఫిలిప్పీన్స్ దేశానికి - బియ్యం ఎగుమతి పై మధ్యవర్తి లేరు- ఉత్తమ్ కుమార్ రెడ్డి  
  • ఫిలిప్సీన్స్‌ తెలంగాణ ప్రభుత్వాల మధ్య డైరెక్ట్ ఒప్పందం ఉంది
  • హరీష్ రావు వ్యాఖ్యలు  పూర్తిగా అవాస్తవం.. కంప్లిట్లి ఫాల్స్.
  • కేంద్రం ఎగుమతికి - ఫిలిప్పీన్స్ కి సంబంధం లేదు.
  • సభలో హరీష్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నాను.
  • హరీష్ రావు అడిగిన సంస్థకు టెండర్ ఇవ్వకపోతే స్కామ్ అని అంటారా?
  • సివిల్ సప్లై శాఖలో ఆర్థిక భారం పెరిగింది.
  • 4వేల అదనపు భారం సివిల్ సప్లై శాఖ పై ఉంది.ఆర్థిక భారాన్ని తగ్గించడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం.
     
  • తెలంగాణ శాసన సభలో బియ్యం పై రాసాభాస
  • సన్న బియ్యం బోనస్ పెండింగ్ నిదులు ఇవ్వాలని BRS డిమాండ్.
  • పెండింగ్ బోనస్ బకాయిల విడుదల పై సమాధానం ఇవ్వని ప్రభుత్వం.
  • ప్రేమ్ చంద్ అనే వ్యక్తిని సలహాదారుగా పెట్టుకున్నారా? లేదా? BRS ప్రశ్నకు జవాబు ఇవ్వని మంత్రి ఉత్తమ్.
  • బియ్యం స్కామ్ పై హౌస్ కమిటీకి డిమాండ్ చేసిన హరీష్ రావు.
  • హరీష్ రావు అడిగిన కంపినికి ఇవ్వనందుకే ఆరోపణలు అన్న ఉత్తమ్.
  • హౌస్ కమిటీ వేయాలనే హరీష్ రావు డిమాండ్ కు.. ముందుకి రాని ఉత్తమ్ కుమార్ రెడ్డి

ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో ఫీలిపిన్స్ కు  బియ్యం పంపడం పెద్ద స్కామ్ అంటూ మండిపడ్డారు.

  • మంత్రి ఉత్తమ్ సభను పక్కదారి పట్టిస్తున్నారు.
  • ఘరానా మోసగాడు అయిన ప్రేమ్ చంద్ అనే వ్యక్తిని సలహాదారుగా పెట్టుకున్నారు?
  • బియ్యం ఎగుమతి కేంద్రానికి కాకుండా పిలిపిన్స్ కు ప్రైవేట్ సంస్థకు ఎందుకు ఇచ్చారు?
  • బియ్యం ఎగుమతికి టెండర్లు పిలిచారా?
  • ఏడాది నుంచి కాకినాడ పోర్ట్ లో పెట్టారు? ఏడాది నుంచి పోర్ట్ లో పెడితే ముక్కిపోదా?
  • బియ్యం ఎగుమతి లో స్కామ్ జరిగింది.
  • ప్రభుత్వానికి నిజాయితీ ఉంటే హౌస్ కమిటీ వేయాలి.
  • హెలికాప్టర్ లో కాకినాడ వెళ్లారు.. కానీ అక్కడ నష్టం వచ్చింది.
  • నామినేషన్ బేసిస్ లో ప్రైవేట్ సంస్థకు ఎలా కేటాయిస్తారు?
     

ఛలో అసెంబ్లీకి బీజేపీ పిలుపు, భారీగా మోహరించిన పోలీసులు. 
కాంగ్రెస్‌ ప్రభుత్వం వాగ్దానం చేసిన  6 గ్యారెంటీలు అమలు చేయాలని డిమాండ్‌చేస్తూ బీజేపీ ఛలో అసెంబ్లీకి పిలుపు నిచ్చింది. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడుస్తున్నా  ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ప్రజలను మోసం చేశారని విమర్శలు. 

సాక్షి, హైదరాబాద్‌:  తెలంగాణా అసెంబ్లీలో ఈరోజు పలు కీలక అంశాలు చర్చకు రానున్నాయి. ఉగాది, రంజాన్  పండుగల  విరామం తర్వాత ఉభయ సభలు ఇవాళ(సోమవారం) పునఃప్రారంభం అయ్యాయి. నేటి అసెంబ్లీ సమావేశాల్లో రాష్ట్ర ప్రభుత్వం రెండు ముఖ్యమైన బిల్లులను సభ ముందుకు తీసుకురానుంది. 

వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ తెలంగాణ వైద్య విధాన పరిషత్ (రద్దు) బిల్లు, 2026ను ప్రవేశపెట్టనున్నారు. దీని ద్వారా వైద్య వ్యవస్థలో పాలనాపరమైన మార్పులు తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది. మరీ ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో టీజీఎస్ఆర్టీసీ ఉద్యోగుల విలీనం,  అలాగే గిగ్ వర్కర్ల కోసం సంక్షేమ చర్యలు, భూ రికార్డుల డిజిటలైజేషన్ వంటి లాంటి అంశాలపై వాడి వేడి చర్చజరగనుంది.  దీనికి సంబంధించిన అప్‌డేట్స్‌.. 
 

Advertisement
 
Advertisement
Advertisement