బి గ్రేడ్ ఎర్రచందనం టన్ను రూ.50 లక్షలు | B grade Red sanders auction worth Rs 50 lakhs | Sakshi
Sakshi News home page

బి గ్రేడ్ ఎర్రచందనం టన్ను రూ.50 లక్షలు

Nov 27 2014 4:19 AM | Updated on Sep 2 2017 5:10 PM

అటవీ శాఖ గిడ్డంగుల్లో ఉన్న ఎర్రచందనం ఈ-వేలంలో బుధవారం కూడా బిడ్డర్లు పోటాపోటీగా పాల్గొన్నారు. సోమవారం వీటి వేలం మొదలైంది.

సాక్షి, హైదరాబాద్: అటవీ శాఖ గిడ్డంగుల్లో ఉన్న ఎర్రచందనం ఈ-వేలంలో బుధవారం కూడా బిడ్డర్లు పోటాపోటీగా పాల్గొన్నారు. సోమవారం వీటి వేలం మొదలైంది. మంగళవారం వేలం నిర్వహించలేదు. తిరిగి బుధవారం నిర్వహించారు. అయితే తొలిరోజుతో పోల్చితే బుధవారం రేటు గణనీయంగా తగ్గిపోయింది. బి గ్రేడ్ టన్ను సగటు ధర సోమవారం 1.35 కోట్లు కోట్ కాగా బుధవారం రూ.50 లక్షలకు తగ్గింది. బుధవారం మొత్తం 746.882 టన్నులను 30 లాట్లుగా వేలం వేశారు. 27.95 టన్నుల ‘బి’ గ్రేడ్ ఎర్రచందనానికి సగటున టన్నుకు రూ.50 లక్షలు ధర పలికింది. 718.92 టన్నుల సి గ్రేడ్‌కు సగటున టన్ను రూ. 25.88 లక్షలు పలికింది. సి గ్రేడ్ టన్నుకు గరిష్ట ధర రూ. 37.24 లక్షలు, కనిష్ట ధర రూ. 16 లక్షలు కోట్ అయ్యింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement