రిజర్వేషన్లపై మంత్రి తీవ్ర వివాదాస్పద వ్యాఖ్యలు | Ayyanapathrudu Controversial Comments On Reservations | Sakshi
Sakshi News home page

రిజర్వేషన్లపై మంత్రి తీవ్ర వివాదాస్పద వ్యాఖ్యలు

Aug 1 2018 4:35 PM | Updated on Sep 15 2018 3:13 PM

Ayyanapathrudu Controversial Comments On Reservations - Sakshi

సర్పంచ్‌లుగా ఎస్సీ, ఎస్టీ ఎవరున్న పెత్తనమంతా నాయకులదే..

సాక్షి, అమరావతి : రిజర్వేషన్లపై ఏపీ మంత్రి అయ్యన్నపాత్రుడు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సర్పంచ్‌లుగా ఎస్సీ, ఎస్టీ ఎవరున్న పెత్తనమంతా నాయకులదే అని రిజర్వేషన్లను కించపరిచే విధంగా మాట్లాడారు. గడువు ముగిసిన సర్పంచ్‌లతో బుధవారం విశాఖపట్నంలో ఆయన సమావేశమై మాట్లాడారు. పంచాయతీలో రిజర్వేషన్ల అమలు మామూలు విషయమే అని అన్నారు. మంత్రి స్థాయిలో ఉండి ఇలా మాట్లాడం ఏంటని స్థానికులు ఆశ్చర్యపోయారు.

ఎస్సీ, ఎస్టీలను కించపరిచే విధంగా మాట్లాడడం టీడీపీ ప్రభుత్వానికి ఇదేం తొలిసారి కాదు. గతంలో సీఎం చంద్రబాబు ఓ సమావేశంలో మాట్లాడుతూ.. ‘ఎస్సీ, ఎస్టీలుగా పుట్టాలని ఎవరు కోరుకుంటారు’ అని వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. నేటితో గ్రామపంచాయతీ సర్పంచ్‌ల పదవీకాలం ముగియడంతో ప్రత్యేక అధికారులను నియమిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

Advertisement
 
Advertisement
Advertisement