ఆటోలో ప్రయాణిస్తున్న ప్రయాణికునిపై దాడి చేసి, అతని వద్ద నుంచి 8 తులాల బంగారాన్ని ఆటో డ్రైవర్ అపహరించిన సంఘటన గురువారం తెల్లవారుజామున విశాఖపట్నంలో చోటు చేసుకుంది.
ఆటోలో ప్రయాణిస్తున్న ప్రయాణికునిపై దాడి చేసి, అతని వద్ద నుంచి 8 తులాల బంగారాన్ని ఆటో డ్రైవర్ అపహారించిన సంఘటన గురువారం తెల్లవారుజామున విశాఖపట్నం సమీపంలోని డాకమర్రి గ్రామంలో చోటు చేసుకుంది. దాంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
విజయరామరాజుపేట ఉన్నతపాఠశాలలో తాను ఉపాధ్యాయుడిగా విధులు నిర్వర్తిస్తున్నట్లు బాధితుడు పోలీసులకు వెల్లడించారు. ఈ రోజు ఉదయం నగరానికి చేరుకున్న తాను ఇంటికి వెళ్లేందుకు ఆటో ఎక్కానని, అయితే డాకమర్రి వద్ద ఆటో డ్రైవర్ ఆటో ఆపి తనపై దాడి చేసి, బంగారం, డబ్బు ఎత్తుకు వెళ్లాడని పోలీసులకు చేసిన ఫిర్యాదులో పేర్కొన్నారు.