ఉద్యోగిపై దాడి.. టీడీపీ నేతపై కేసు నమోదు
శ్రీకాకుళం : ఉపాధి హామీ టెక్నికల్ అసిస్టెంట్ పై దాడి చేసిన టీడీపీ నేత కందాపు వెంకటరమణపై అట్రాసిటీ కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన టీడీపీ నేత ఉపాధి హామీ టెక్నికల్ అసిస్టెంట్ పై దాడిచేశారని, వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. బాధిత ఉద్యోగి నుంచి సమాచారం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసినట్లు, ఎఫ్ఐఆర్ దాఖలు చేసి కేసు దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి