ఈ ఎన్నికల్లో టీడీపీ ఖాళీ అవుతుంది | Arthur Says YSRCP Will Clean Sweep Municipal Elections In Nandikotkur | Sakshi
Sakshi News home page

క్లీన్‌ స్వీప్‌ చేస్తాం: ఎమ్మెల్యే

Mar 10 2020 2:07 PM | Updated on Mar 10 2020 2:26 PM

Arthur Says YSRCP Will Clean Sweep Municipal Elections In Nandikotkur - Sakshi

సాక్షి, కర్నూలు: దేశంలోనే ఎక్కడా లేని విధంగా పోలింగ్‌ కంటే ముందే మద్యం షాపులు మూసివేయాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయం తీసుకున్నారని ఎమ్మెల్యే ఆర్థర్‌ అన్నారు. గ్రామాల్లో ఎక్కడా డబ్బులు, మద్యం పంపిణీ లేకుండా ఎన్నికలు జరగాలని సీఎం జగన్‌ ఆదేశించారన్నారు. మంగళవారం నందికొట్కూర్‌లోని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో పలువురు టీడీపీ నాయకులు ఎమ్మెల్యే ఆర్థర్‌ సమక్షంలో వైఎస్సార్‌సీపీలోకి చేరారు.

అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అధిక స్థానాల్లో విజయకేతనం ఎగురవేస్తుందని, టీడీపీ ఖాళీ అవుతుందన్నారు. కొన్ని కోట్ల రూపాయలతో గ్రామాల్లో అభివృద్ధి జరుగుతుందని పేర్కొన్నారు. ఇక జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో నందికొట్కూర్‌ నియోజకవర్గంలో వైఎస్సార్‌సీపీ పార్టీ క్లీన్‌ స్వీప్‌ చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అందరం కలిసికట్టుగా అన్ని స్థానాలను కైవసం చేసుకుని సీఎం జగన్‌కు బహుమతిగా అందిద్దామని పిలుపునిచ్చారు.

టీడీపీకి షాక్‌: వైఎస్సార్‌సీపీలోకి భారీ చేరికలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement