అసెంబ్లీ వద్దకు గ్యాలరీ పాసులతో వచ్చిన నలుగురు ఆక్వాపార్క్ బాధితులను అరెస్ట్ చేశారు.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ వద్దకు గ్యాలరీ పాసులతో వచ్చిన నలుగురు ఆక్వాపార్క్ బాధితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ముఖ్యమంత్రి, స్పీకర్‌లను కలుస్తామని ఆక్వాపార్క్ బాధితులు వేడుకున్నా పోలీసులు వారిని అసెంబ్లీలోకి అనుమతించకపోగా.. అదుపులోకి తీసుకున్నారు. వాహనంలో నలుగురు ఆక్వాపార్క్ బాధితులను అక్కడనుంచి తరలించారు. పశ్చిమ గోదావరి జిల్లా తుందుర్రు వద్ద ప్రభుత్వం చేపడుతున్న ఆక్వాపార్క్ నిర్మాణంపై పరిసర గ్రామాల ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే.