పరీక్షల తేదీలు ఖరారు చేసిన ఏపీపీఎస్సీ | APPSC Announces New Exams Dates For Postponed Notifications | Sakshi
Sakshi News home page

ఉద్యోగాల నియామకాల ప్రక్రియ సిద్ధం చేస్తున్న ఏపీ ప్రభుత్వం

Jun 22 2020 10:07 PM | Updated on Jun 22 2020 10:15 PM

APPSC Announces New Exams Dates For Postponed Notifications - Sakshi

సాక్షి, విజయవాడ : రాష్ట్రంలో ఉద్యోగాల నియామకాల ప్రక్రియను ప్రభుత్వం సిద్ధం చేస్తోంది. గతంలో జారీచేసిన నోటిఫికేషన్లకు సంబంధించిన నియామక పరీక్షలు నిర్వహించాలని ఏపీపీఎస్సీ నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా కరోనా వ్యాప్తి నేపథ్యంలో గతంలో వాయిదా వేసిన పలు పరీక్షల తేదీలను ఏపీపీఎస్సీ ఖరారు చేసింది. ఈ మేరకు సోమవారం పరీక్షల తేదీల వివరాలతో కూడిన ఒక ప్రకటన విడుదల చేసింది. సెప్టెంబర్‌ 15న ప్రారంభించనుంది. నవంబర్‌ 13 వరకు పలు తేదీల్లో వివిధ ఉద్యోగ నియామక పరీక్షలను ఏపీపీఎస్సీ నిర్వహించనుంది.

కొత్తగా ప్రకటించిన నియామక పరీక్షల తేదీలు
► సెప్టెంబర్‌ 15, 16 తేదీల్లో డిగ్రీ కళాశాల లెక్చరర్ల నియామక పరీక్షలు 
► సెప్టెంబర్‌ 21, 22, 23, 24 తేదీల్లో గెజిటెడ్‌ ఉద్యోగాల నియామక పరీక్షలు 
► సెప్టెంబర్‌ 21, 22 అసిస్టెంట్‌ బీసీ, సోషల్‌, ట్రైబల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ ఉద్యోగ పరీక్షలు 
► సెప్టెంబర్‌ 22న రాయల్టీ ఇన్‌స్పెక్టర్‌ ఇన్‌ మైనింగ్‌ సర్వీస్‌ ఉద్యోగ నియామక పరీక్ష
► సెప్టెంబర్‌ 23న సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌ ఉద్యోగాల నియామక పరీక్ష 
► సెప్టెంబర్‌ 23న పోలీస్‌ విభాగంలో టెక్నికల్‌ అసిస్టెంట్‌ ఉద్యోగాల నియామక పరీక్ష 
► సెప్టెంబర్‌ 23, 24 పట్టణ ప్రణాళిక విభాగంలో అసిస్టెంట్‌ డైరెక్టర్‌ పోస్టుల భర్తీకి పరీక్షలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement