కియా మోటార్స్‌కు అనుమతులివ్వండి | Approve to KIA Motors says CM Chandrababu | Sakshi
Sakshi News home page

కియా మోటార్స్‌కు అనుమతులివ్వండి

Jun 25 2017 1:04 AM | Updated on Aug 14 2018 11:26 AM

కియా మోటార్స్‌కు అనుమతులివ్వండి - Sakshi

కియా మోటార్స్‌కు అనుమతులివ్వండి

కియా మోటార్స్‌ ఏర్పాటుకు అవసరమైన అనుమతులన్నీ త్వరగా ఇవ్వాలని సీఎం చంద్రబాబుఅధికారులను ఆదేశించారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు
 
సాక్షి, అమరావతి: కియా మోటార్స్‌ ఏర్పాటుకు అవసరమైన అనుమతులన్నీ త్వరగా ఇవ్వాలని సీఎం చంద్రబాబుఅధికారులను ఆదేశించారు. శనివారం ఉండవల్లిలోని తన నివాసంలో కియా మోటార్స్‌కు అనంతపురంలో కేటాయించిన భూముల్లో భూమి చదును, నీరు, విద్యుత్‌ వంటి మౌలిక సదుపాయాల ఏర్పాటు అంశాలను సమీక్షించారు. అనంతపురం కలెక్టర్‌తో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతూ అనుమతులన్నీ అనుకున్న సమయానికన్నా ముందే జారీ చేయాలన్నారు. ప్రాజెక్ట్‌కు అవసరమైన విద్యుత్, నీరు, రోడ్లు వంటి మౌలిక సదుపాయాలు భవిష్యత్‌లో రాబోయే ప్రాజెక్టులను దృష్టిలో పెట్టుకుని  రూపొందించాలని అధికారులకు సూచించారు.

రియల్‌ టైం గవర్నెన్స్‌ సీఈవో బాబు ఎ. వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సైట్‌ లో జరుగుతున్న పనులను ముఖ్యమంత్రికి వివరించారు. కియా మోటార్స్‌ కోరిన విధంగా శిక్షణా కేంద్రం, టౌన్‌ షిప్‌ నిర్మాణం కోసం భూమిని గుర్తించామని తెలిపారు. కియా మోటార్స్‌ ప్రతినిధులు వారు చేపట్టే పనుల వివరాలను ముఖ్యమంత్రికి వివరించారు. కియా మోటార్స్‌ కు కేటాయించిన భూమిలో 14.4 హెక్టార్ల భూమి చదును పూర్తిచేయడం జరిగిందని.. మిషనరీ, లేబర్, రోజువారీ పూర్తిచేసిన పనుల వివరాలను అనంతపురం కలెక్టర్‌ వీరపాండ్యన్‌ ముఖ్యమంత్రికి వివరించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement