
'ఉద్యోగ నేతలు తప్పు లెక్కలు చెప్పారు'
ఉద్యోగులకు ఇచ్చిన హామీలన్నింటినీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నెరవేర్చాలని ఏపీ ఎన్టీవో అధ్యక్షుడు అశోక్ బాబు డిమాండ్ చేశారు.
హైదరాబాద్ : ఉద్యోగులకు ఇచ్చిన హామీలన్నింటినీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నెరవేర్చాలని ఏపీ ఎన్టీవో అధ్యక్షుడు అశోక్ బాబు డిమాండ్ చేశారు. ఆయన బుధవారమిక్కడ మాట్లాడుతూ కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ క్రమబద్దీకరించాలన్నారు. ఆంధ్రప్రదేశ్ పునర్ నిర్మాణంలో ఉద్యోగులు క్రియాశీలక పాత్ర పోషిస్తారని అశోక్ బాబు అన్నారు. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో మిగులు ఉద్యోగులు ఉన్నారని తేటతెల్లమైందన్నారు. ఉద్యోగుల సంఖ్యపై తెలంగాణ నేతలు తప్పు లెక్కలు చెప్పారని ఆయన ఆరోపించారు.