ఎన్నికల సమయంలో ఆచరణ సాధ్యం కాని వాగ్దానాలతో ప్రజలను మోసం చేసిన టీడీపీ ప్రభుత్వంపై ప్రజా గళం వినిపించేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేపడుతున్న సమరదీక్షపై ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోంది.
గుంటూరు: ఎన్నికల సమయంలో ఆచరణ సాధ్యం కాని వాగ్దానాలతో ప్రజలను మోసం చేసిన టీడీపీ ప్రభుత్వంపై ప్రజా గళం వినిపించేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి చేపడుతున్న సమరదీక్షపై ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోంది. ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు హాజరవుతున్నా భద్రత కల్పించలేదు. కనీసం దీక్షాస్థలిలో కూడా పోలీసులు అందుబాటులో లేకపోవటం గమనార్హం.
ఇదిలా ఉండగా.. రాష్ట్రం నలుమూలల నుంచి పార్టీ నాయకులు, కార్యకర్తలు వేలాదిగా తరలి వస్తున్నారు. చిత్తూరు నుంచి శ్రీకాకుళం వరకు అన్ని జిల్లాల నుంచి వైఎస్ జగన్ అభిమానులు, పార్టీ కార్యకర్తలు ఇప్పటికే దీక్షా స్థలికి బయలు దేరారు.