సీఎం వైఎస్ జగన్‌ పర్యటన షెడ్యూల్‌ | AP CM YS Jagan Tour Schedule For Today | Sakshi
Sakshi News home page

సీఎం వైఎస్ జగన్‌ పర్యటన షెడ్యూల్‌

Jun 9 2019 8:42 AM | Updated on Jun 9 2019 8:45 AM

AP CM YS Jagan Tour Schedule For Today  - Sakshi

సాక్షి, అమరావతి: ప్రధానమంత్రి నరేంద్రమోదీ రాక సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదివారం చిత్తూరు జిల్లా వెళ్లనున్నారు. ప్రధానికి ఉభయ తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రేణిగుంట విమానాశ్రయంలో స్వాగతం పలుకనున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి షెడ్యూల్‌ ఈ విధంగా ఉంది. మరోవైపు ప్రధాని, ముఖ్యమంత్రి చిత్తూరు జిల్లాకు వస్తుండటంతో అధికార యంత్రాంగం రేణిగుంట విమానాశ్రయం నుంచి తిరుమల వరకు మూడువేల మందితో భారీ భద్రతా ఏర్పాట్లు చేసింది. వీరిరువురు ప్రయాణించే మార్గాల్లో అణువణువు తనిఖీలు నిర్వహించారు. అదేవిధంగా ఆయా మార్గాల్లో అధికారులు నిన్న ట్రయల్‌ రన్‌ కూడా నిర్వహించారు.

  • మధ్యాహ్నం 3.45కు రేణిగుంటకు చేరుకోనున్న సీఎం వైఎస్‌ జగన్‌
  • ప్రధాని మోదీకి స్వాగతం పలకనున్న గవర్నర్‌, ముఖ్యమంత్రి
  • సాయంత్రం 4.30 గంటలకు రోడ్డు మార్గాన తిరుమలకు సీఎం జగన్‌
  • రాత్రి 8 గంటలకు తిరుమల నుంచి రేణిగుంట విమానాశ్రయానికి ముఖ్యమంత్రి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement