సందర్శకులకు చంద్రబాబు ఆర్ధిక సాయం | AP CM Chandrababu financial helps visitors in vijayawada | Sakshi
Sakshi News home page

సందర్శకులకు చంద్రబాబు ఆర్ధిక సాయం

Feb 2 2016 4:01 PM | Updated on Oct 2 2018 5:51 PM

సందర్శకులకు చంద్రబాబు ఆర్ధిక సాయం - Sakshi

సందర్శకులకు చంద్రబాబు ఆర్ధిక సాయం

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కార్యాలయానికి మంగళవారం సందర్శకులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.

విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కార్యాలయానికి మంగళవారం సందర్శకులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. వివిధ జిల్లాల నుంచి చంద్రబాబును కలవడానికి వచ్చిన వారితో ప్రాగంణం కిక్కిరిసిపోయింది. విద్య, ఆరోగ్య,  ఆర్ధికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారి సమస్యలను చంద్రబాబు స్వయంగా అడిగి తెలుసుకున్నారు. వారికి ఆర్థికం సాయం అందించారు.

► విజయవాడకు చెందిన నాగుల్‌బికు కిడ్నీ చికిత్స కోసం లక్ష రూపాయల సహాయం ప్రకటించారు.
► గుంటూరు జిల్లాకు చెందిన రమాదేవి క్యాన్సర్ వ్యాధితో బాధపడుతుండడంతో ఆమె వైద్యానికి రూ. 2 లక్షలు మంజూరు చేశారు.
► కృష్ణాజిల్లా జగ్గయ్యపేటకు చెందిన వెంకటరావమ్మ రైలు ప్రమాదంలో గాయపడి చికిత్సపొందుతూ ఆర్ధికంగా దెబ్బతిన్నారు. ఆమెకు రూ. లక్ష రూపాయలు మంజూరు చేస్తూ ఆదేశాలిచ్చారు.

 పలువురికి ఉన్నత చదువులు, వివాహానికి, వైద్య ఖర్చులకు, ఆర్ధికంగా ఎదుగుదలకు చంద్రబాబు సాయం అందించారు. ప్రభుత్వం అన్ని విధాల ఆదుకుంటుందని వారికి ఆయన భరోసా నిచ్చారు. దీనిపై సందర్శకులు హర్షం వ్యక్తం చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement