సీఎస్‌గా నీలం సాహ్ని కొనసాగింపు! | AP Chief Secretary Neelam Sahani to Get Extension | Sakshi
Sakshi News home page

సీఎస్‌గా నీలం సాహ్ని కొనసాగింపు!

May 14 2020 8:34 AM | Updated on May 14 2020 8:38 AM

AP Chief Secretary Neelam Sahani to Get Extension - Sakshi

నీలం సాహ్ని

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నీలం సాహ్నిని కొనసాగించేందుకు అనుమతించాల్సిందిగా ప్రధాని మోదీకి సీఎం వైఎస్‌ జగన్‌ విజ్ఞప్తి చేసినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.

సాక్షి, అమరావతి: ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నీలం సాహ్నిని మరో ఆరు నెలలు కొనసాగించేందుకు అనుమతించాల్సిందిగా ప్రధాని మోదీకి సీఎం వైఎస్‌ జగన్‌ విజ్ఞప్తి చేసినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ మేరకు సీఎం ఇటీవల ప్రధానికి లేఖ రాసినట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి. నీలం సాహ్ని జూన్‌ 30న పదవీ విరమణ చేయనున్నారు. కరోనా నేపథ్యంలో సీఎస్‌ విధులు కీలకమైనందున పదవీ కాలం పొడిగించాలని కోరినట్లు సమాచారం. (ప్రతి మూడు వారాలకు ఆరోగ్య శ్రీ బిల్లులు)

ఎస్‌ఈబీకి 11 మంది ఏఎస్పీల బదిలీ
రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన స్పెషల్‌ ఎన్‌ఫోర్సుమెంట్‌ బ్యూరో(ఎస్‌ఈబీ–లిక్కర్‌ అండ్‌ శాండ్‌)కు పదకొండు మంది ఏఎస్పీలు బదిలీ అయ్యారు. ఆ ఐపీఎస్‌లకు పలు జిల్లాల్లో కొత్తగా ఎస్‌ఈబీ పోస్టును ఏర్పాటు చేసి ప్రభుత్వం బాధ్యతలు అప్పగించింది. ఈ మేరకు ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి కుమార్‌విశ్వజిత్‌ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement