మద్యం ఎరులై పారుతోంది: గోపాలకృష్ణ ద్వివేది | AP CEO Gopala Krishna Dwivedi Press Meet On Elections | Sakshi
Sakshi News home page

మద్యం ఎరులై పారుతోంది: గోపాలకృష్ణ ద్వివేది

Mar 21 2019 6:54 PM | Updated on Mar 23 2019 8:59 PM

AP CEO Gopala Krishna Dwivedi Press Meet On Elections - Sakshi

గోపాలకృష్ణ ద్వివేది

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో జరిగే అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో నగదు, మద్యం ఎరులై పారుతోందని  ఏపీ ప్రధాన ఎన్నికల అధికారి  గోపాలకృష్ణ ద్వివేది అన్నారు. గురువారం సాయంత్రం ఆయన మీడియాతో సమావేశంలో మాట్లాడుతూ... ఏపీలో కనివిని ఎరుగని స్థాయిలో మద్యం, నగదు, బంగారం, వజ్రాలు పట్టుబడుతున్నాయని అన్నారు. ఎన్నికల్లో మద్యం ప్రవాహంపై నిఘా ఏర్పాటు చేశామన్నారు. గత ఏడాది ఇదే సమయానికి ఎన్ని విక్రయాలు జరిగాయో ప్రమాణికంగా  తీసుకుంటున్నాం. ఎన్నికల్లో వినియోగించేందుకు నిల్వ చేసిన పది కోట్ల విలువైన మద్యాన్ని సీజ్ చేశామన్నారు.

2014ఎన్నికల్లో మొత్తం పట్టుబడిన మద్యం విలువ 9 కోట్లు మాత్రమే అని తెలిపారు. పోలీస్ ఫ్లైయింగ్ స్క్వాడ్ తనిఖీల్లో రూ.4,67,46,504 నగదు, 12.026కేజీల బంగారం, 61.163 కేజీల వెండితో పాటు 3214.92 లీటర్ల మద్యం, 33కేజీల గంజాయి, 38.81లక్షల విలువైన ఖైనీ, పాన్ మసాలా పాకెట్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. సీజ్ స్టాటిక్ సర్వైలెన్స్‌ టీం తనిఖీల్లో రూ.19.18 లక్షల విలువైన డ్రస్ మెటీరియల్స్‌తో పాటు రూ.17,54,41,729 నగదు, 18.477కేజీల బంగారం,  67.96కేజీల వెండి, 16వజ్రాలు, రూ.1.96కోట్ల విలువైన వస్తువులు.,  1241 లీటర్ల మద్యం, 6 కార్లు., 1200 కుర్చీలు స్వాధీనం చేసుకున్నామని అన్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు పోలీసుల తనిఖీల్లో రూ.5.03 కోట్ల నగదు, 30.28కేజీల బంగారం,  24.168 కేజీల వెండి, 2408 లీటర్ల వెండి,  3లక్షల గుట్కా ప్యాకెట్లు., 4వేల చీరలను స్వాధీనం చేసుకున్నట్లు ఆయన మీడియాకు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement