ఏపీ అసెంబ్లీ పనిదినాల పెంపు

 ap assembly sessions extended - Sakshi

సాక్షి, అమరావతి: ఏపీ అసెంబ్లీ సమావేశాల పని దినాలను పెంచారు. ఈ నెల 27,28, 29 తేదీలలోనూ సమావేశాలు జరపాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు అధ్యక్షతన జరిగిన బీఏసీ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకున్నారు. కాగా ఈ నెల 25 న అసెంబ్లీకి సెలవు ప్రకటించారు.

ప్రధాన ప్రతిపక్షం లేకుండానే ఈ నెల 10 న ప్రారంభమైన ఏపీ అసంబ్లీ సమావేశాలు మొత్తం 10 రోజుల పాటు నిర్వహించాలనుకున్నారు. 25 వరకు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించేలా అప్పట్లో బీఏసీ సమావేశంలో నిర్ణయించారు. 11, 12, 16, 17, 18, 19 తేదీల్లో సభకు సెలవు ప్రకటించారు. తిరిగి నేడు ( సోమవారం) అసెంబ్లీ సమావేశాల ప్రారంభమైన తర్వాత పని దినాలను పెంచుతున్నట్టు అధికారంగా తెలిపారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top