అనూహ్య’ కేసును వెంటనే పరిష్కరించాలి | anuhaya murder case immediately finished | Sakshi
Sakshi News home page

అనూహ్య’ కేసును వెంటనే పరిష్కరించాలి

Feb 18 2014 3:39 AM | Updated on Jul 30 2018 8:27 PM

అనూహ్య’ కేసును వెంటనే పరిష్కరించాలి - Sakshi

అనూహ్య’ కేసును వెంటనే పరిష్కరించాలి

మచిలీపట్నానికి చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ సింగవరపు ఎస్తేర్ అనూహ్య హత్య కేసులో పోలీసుల వ్యవహారశైలి పలు అనుమానాలకు తావిస్తుందని గుడివాడ డివిజన్ పాస్టర్స్ ఫెలోషిప్ అధ్యక్షుడు గంధం సత్యవర్దన్ విమర్శించారు.


 
 గుడివాడ టౌన్,  :  మచిలీపట్నానికి చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ సింగవరపు ఎస్తేర్ అనూహ్య హత్య కేసులో పోలీసుల వ్యవహారశైలి పలు అనుమానాలకు తావిస్తుందని గుడివాడ డివిజన్ పాస్టర్స్ ఫెలోషిప్ అధ్యక్షుడు గంధం సత్యవర్దన్ విమర్శించారు.
 
 స్థానిక కోతిబొమ్మ సెంటర్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద దళిత నేతలు, పాస్టర్లు సోమవారం నిరసన కార్యక్రమం జరిపారు. పోలీసుల తీరు, ప్రభుత్వ అలసత్వాన్ని తప్పుపట్టారు. అనంతరం ఆర్డీవో కార్యాలయంలో వినతిపత్రం సమర్పించారు. యునెటైడ్ పాస్టర్స్ ఫెలోషిప్ పట్టణాధ్యక్షులు పి.ప్రేమ్‌సాగర్, పాస్టర్లు  సి.జె.దాస్, శ్యామ్‌బాబు,  శ్యామ్యుల్, పాస్టర్ సురేష్,  ఆదిమాంధ్ర సంఘం జిల్లా అధ్యక్షుడు పొంగులేటి జయరాజు, దళిత సంఘాల నేతలు రాంబాబు, సుధాకర్, వై.వీరాస్వామి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement