అంగన్‌వాడీలు..అరెస్ట | anganvadi employees arrested very crucial | Sakshi
Sakshi News home page

అంగన్‌వాడీలు..అరెస్ట

Feb 25 2014 4:40 AM | Updated on Aug 21 2018 5:46 PM

అంగన్‌వాడీలు..అరెస్ట - Sakshi

అంగన్‌వాడీలు..అరెస్ట

అంగన్‌వాడీల డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ హైదరాబాద్‌లోని ఇందిరాపార్కు వద్ద సీఐటీయూ ఆధ్వర్యంలో చేపట్టే ధర్నాకు వెళ్తున్న అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆయాలను సోమవా రం సూర్యాపేట పట్టణ సమీపంలో పో లీసులు అడ్డుకున్నారు.

 భానుపురి,
 అంగన్‌వాడీల డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ హైదరాబాద్‌లోని ఇందిరాపార్కు వద్ద సీఐటీయూ ఆధ్వర్యంలో  చేపట్టే ధర్నాకు వెళ్తున్న అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆయాలను సోమవా రం సూర్యాపేట పట్టణ సమీపంలో పో లీసులు అడ్డుకున్నారు.

 

సూర్యాపేట పట్టణంతో పాటు జగ్గయ్యపేట, నిడదవోలు, నందిగామ, తిరువూరు, ఖమ్మం ప్రాంతాలకు చెందిన సుమారు 300 మంది అంగన్‌వాడీలను అదుపులోకి తీ సుకొని పట్టణ పోలీస్‌స్టేషన్‌కు తరలిం చారు. అంగన్‌వాడీలను సొంతపూచీకత్తుపై మధ్యాహ్న సమయంలో పోలీ సులు స్టేషన్ నుంచి బయటకు పంపిం చారు. అంగన్‌వాడీలను పోలీసులు ని ర్బంధించడాన్ని నిరసిస్తూ అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆయాలు స్టేషన్ ఎదుట రా స్తారోకో చేశారు.

 

అదే విధంగా స్టేషన్‌లో ఆందోళన కొనసాగించారు. విషయం తెలుసుకున్న జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీ రామ్‌రాజగోపాల్, టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ పటేల్ రమేష్‌రెడ్డి, సీపీఎం డివి జన్ కార్యదర్శి నెమ్మాది వెంకటేశ్వర్లు, సీఐటీయూ డివిజన్ కార్యదర్శి వెంపటి గురూజీ, వివిధ పార్టీల ప్రజా సంఘాల నాయకులు పెద్దిరెడ్డి రాజా, మల్లు నాగార్జునరెడ్డి, ఎల్గూరి గోవింద్, షఫీఉల్లా, నేరెళ్ల మధుగౌడ్, బాలసైదులుగౌడ్, సాయికుమార్, కోట గోపి, పెంటయ్య  స్టేషన్ వద్దకు చేరుకొని అంగన్‌వాడీల ఆందోళనకు మద్దతు తెలి పారు.

 

ఈ సందర్భంగా నాయకులు మా ట్లాడుతూ అంగన్‌వాడీలు  కొన్ని రో జు లుగా వారి న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని వివిధ రూపాల్లో ఆం దోళనలు కొనసాగిస్తుంటే ప్రభుత్వం పట్టించుకోకపోవడం బాధాకరమన్నా రు. అంగన్‌వాడీలకు ప్రభుత్వం కనీస వేతనం అందించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో అంగన్‌వాడీలు సుజాత, రమణ, అలివేలు, పద్మ, శైలజ, నాగమణి, నాగలక్ష్మి, ప్రభావతి పాల్గొన్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement