'ఏపీకి ప్రత్యేక హోదా సులభం కాదని చెప్పాగా' | AndhraPradesh state special status not easy, Venkaiah naidu | Sakshi
Sakshi News home page

'ఏపీకి ప్రత్యేక హోదా సులభం కాదని చెప్పాగా'

Feb 15 2015 1:15 PM | Updated on Mar 23 2019 9:10 PM

'ఏపీకి ప్రత్యేక హోదా సులభం కాదని చెప్పాగా' - Sakshi

'ఏపీకి ప్రత్యేక హోదా సులభం కాదని చెప్పాగా'

న్యూఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓటమికి, ప్రధాని మోదీకి సంబంధం లేదని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం. వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు.

హైదరాబాద్: న్యూఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓటమికి, ప్రధాని మోదీకి సంబంధం లేదని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం. వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు. ఆదివారం హైదరాబాద్లో వెంకయ్య విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ.... ఢిల్లీ ఎన్నికల ఫలితాలు మాకు సవాల్ విసిరాయన్ని అన్నారు. అయినా ప్రజల తీర్పును గౌరవిస్తామన్నారు.

వచ్చే ఎన్నికల్లో మా వ్యతిరేక పక్షాలన్నీ ఏకమయ్యే అవకాశం ఉందని వెంకయ్య అభిప్రాయపడ్డారు. దానిని సవాల్గా స్వీకరిస్తామన్నారు. దేశంలో పేదలకు, ధనికులకు మధ్య అంతరం తగ్గించేందకు తమ ప్రభుత్వం ప్రయత్నిస్తుందన్నారు. నాగార్జున సాగర్ జలాల సమస్య ఇద్దరు సీఎంలు కలసి పరిష్కరించుకోవడం శుభపరిణామం అని ఆయన అన్నారు.

ఏపీకి ప్రత్యేక హోదా అంత సులభం కాదని ఆనాడే చెప్పానని వెంకయ్య ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఎన్టీయేలో టీఆర్ఎస్ చేరతుంది అని విలేకర్లు ప్రశ్నించాగా... అవి ఊహాగానాలే అని తెలిపారు. బీహార్లో పరిణామాలకు మోదీకి సంబంధం లేదని, అది జనతా పరివార్ అంతర్గత సమస్య అని వెంకయ్య వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement