మ‌రో మూడు రోజుల పాటు భారీ వర్షాలు | Andhra Pradesh Weather Forecast For The Next Three days | Sakshi
Sakshi News home page

మ‌రో మూడు రోజుల పాటు భారీ వ‌ర్షసూచ‌న‌

Jul 15 2020 6:20 PM | Updated on Jul 15 2020 7:04 PM

Andhra Pradesh Weather Forecast For The Next Three days - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

ఆంధ్రప్రదేశ్‌లో వ‌చ్చే మూడు రోజుల‌పాటు పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది.

సాక్షి, విజ‌య‌వాడ‌: ఆంధ్రప్రదేశ్‌లో వ‌చ్చే మూడు రోజుల‌పాటు పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. ప్ర‌స్తుతం జార్ఖండ్, దాని పరిసర ప్రాంతాలలో 1.5 నుంచి నుంచి 7.6 కిలోమీటర్ల  త్తు మధ్య ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని పేర్కొంది. ఎత్తుకు వెళ్ళేకొద్దీ నైరుతి దిశ వైపుకు వంపు తిరిగి ఉంద‌ని స్ప‌ష్టం చేసింది. సముద్ర తీరంలో ఏర్పడిన గాలుల కలయిక (షియర్‌ జోన్‌) ప్రభావంతో ఉత్తర కర్ణాటక పరిసర ప్రాంతాల్లో 3.6 నుంచి 4.5 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉంది. అదేవిధంగా... నైరుతి రుతుపవనాలు కోస్తా, రాయలసీమపై చురుగ్గా ఉన్న‌ట్లు పేర్కొంది.  

ఈ ప్రభావంతో మ‌రో రెండు రోజుల‌పాటు రాష్ర్ట వ్యాప్తంగా తేలిక‌పాటి నుంచి ఓ మోస్తారు వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని వాతావ‌ర‌ణ శాఖ వెల్ల‌డించింది. ఇప్ప‌టికే శ్రీకాకుళం, తూర్పుగోదావరి, కృష్ణా, గుంటూరు, అనంతపురం, ప్రకాశం జిల్లాల్లో భారీవర్షాలు కురుస్తున్నాయి. మ‌రో రెండు రోజుల‌పాటు రాష్ర్ట వ్యాప్తంగా చాలాచోట్ల  తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రభుత్వ అధికారుల‌ను వాతావ‌ర‌ణ శాఖ అప్ర‌మ‌త్తం చేసింది. (నేడు ఉత్తరాంధ్రకు భారీ వర్ష సూచన )


 

Advertisement
 
Advertisement
Advertisement