ఏపీలో నేటి నుంచి ఇంటర్ పరీక్షలు | andhra pradesh inter exams begin | Sakshi
Sakshi News home page

ఏపీలో నేటి నుంచి ఇంటర్ పరీక్షలు

Mar 11 2015 9:03 AM | Updated on Aug 18 2018 8:53 PM

ఆంధ్రప్రదేశ్‌లో బుధవారం నుంచి ఇంటర్మీడియెట్ ప్రారంభమయ్యాయి. ఇందుకోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. పరీక్షల నిర్వహణకు...

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్‌లో బుధవారం నుంచి ఇంటర్మీడియెట్ ప్రారంభమయ్యాయి.  ఇందుకోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. పరీక్షల నిర్వహణకు... మొత్తం 1412 కేంద్రాలను సిద్ధం చేశారు. తొలి రోజు ఫస్ట్‌ ఇయర్ ఎగ్జామ్‌కు... నాలుగు లక్షల 71 వేల 86 మంది విద్యార్థులు హాజరు కానున్నారు.

ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్ష జరుగుతుంది. ఒక్క నిమిషం ఆలస్యంగా వచ్చినా.... పరీక్షలకు  అనుమతించబోమని బోర్డు అధికారులు స్పష్టం చేశారు. ప్రథమ, ద్వితీయ సంవత్సరాలకు కలుపుకుని.... మొత్తం 9 లక్షల 91 వేల  మంది హాజరు అవుతున్నారు. కాగా తెలంగాణలో రెండు రోజుల క్రితమే ఇంటర్ పరీక్షలు ప్రారంభమైన విషయం తెలిసిందే.

Advertisement
 
Advertisement
Advertisement