విభజన తర్వాత ఏపీ సమస్యల్లో ఉంది | Andhra pradesh has lot of problems after bifurcation, says chandrababu | Sakshi
Sakshi News home page

విభజన తర్వాత ఏపీ సమస్యల్లో ఉంది

Sep 12 2014 4:44 PM | Updated on Jul 28 2018 3:23 PM

విభజన తర్వాత ఏపీ సమస్యల్లో ఉంది - Sakshi

విభజన తర్వాత ఏపీ సమస్యల్లో ఉంది

విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ సమస్యల్లో ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు.

తిరుపతి: విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ సమస్యల్లో ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు. రాష్ట్ర పరిస్థితులను ఆర్థిక సంఘం ప్రతినిధులకు వివరించామని చంద్రబాబు తెలిపారు. రాష్ట్రానికి అవసరమైన నిధులు కేటాయించాలని వారిని కోరామని చెప్పారు.

ఇతర రాష్ట్రాలతో ఆంధ్రప్రదేశ్‌ను పోల్చి చూడరాదని చంద్రబాబు సూచించారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం సిఫారసు చేయాలని కోరామని, అలాగే రాయలసీమ, ఉత్తరాంధ్రకు ప్రత్యేక నిధులు ఇవ్వాలని  కోరినట్టు చంద్రబాబు తెలిపారు. పరిశ్రమలకు ప్రోత్సాహకాలు అందించాలని, రాజధాని నిర్మాణానికి లక్షా 2 వేల కోట్లు అడిగామని తెలిపారు. ఆర్ధిక సంఘానికి రెండు విజ్ఞాపన పత్రాలు అందించామని, జిల్లాలను యూనిట్‌గా తీసుకుని అభివద్ధి చేస్తామని చంద్రబాబు చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement