అనూహ్య‘స్పందన’

Andhra Pradesh Government Conduct Spandana Program In Guntur - Sakshi

గుంటూరు నగరంలో  ఇళ్ల కోసం పెద్ద ఎత్తున  తరలివచ్చిన మహిళలు 

ప్రత్యేక కౌంటర్ల ద్వారా  వినతుల స్వీకరణ

ఇళ్ల స్థలాల కోసం    ఐదు వేల దరఖాస్తులు

సాక్షి, గుంటూరు : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్పందన కార్యక్రమానికి ప్రజల నుంచి అనూహ్య స్పందన లభిస్తుంది. సమస్యలు ఖచ్చితంగా పరిష్కారం అవుతాయనే నమ్మకంతో పెద్ద ఎత్తున పేదలు తరలివస్తున్నారు. అధికారులు సైతం అప్యాయంగా పలుకరించి, వారి సమస్యలను సావధానంగా విని  పరిష్కార మార్గాలు చూపుతున్నారు. అంతేకాక స్పందన కార్యక్రమానికి పెద్ద ఎత్తున ఫిర్యాదులు వస్తుండటంతో అధికారులు అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేస్తున్నారు. స్థానిక జెడ్పీ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ‘స్పందన’ కార్యక్రమం జనసంద్రాన్ని తలపించింది. ఇళ్లు, ఇంటి స్థలాల కోసం వచ్చే వారికి ఒక కౌంటర్, పింఛను, రేషన్‌ కార్డులకోసం వచ్చే దరఖాస్తుల స్వీకరణ కోసం ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశారు. ఫిర్యాదుదారులు ఇబ్బంది పడకుండా జిల్లా కలెక్టర్‌ శామ్యూల్‌ ఆనందకుమార్‌ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేశారు. గుంటూరు నగరంలో పెద్ద ఎత్తున మహిళలు తరలివచ్చి ఇళ్లు, ఇంటి స్థలాలు ఇవ్వాలని దరఖాస్తులు చేశారు. ఇంటి స్థలాల కోసం ఐదు వేల దరఖాస్తులు, ఇతర సమస్యలకు సంబంధించి 845 అర్జీలు అధికారులకు అందాయి. జిల్లా కలెక్టర్‌ శామ్యూల్‌ ఆనంద్‌ కుమార్, జేసీ దినేష్‌ కుమార్, డీఆర్‌ఓ శ్రీలత, జెడ్పీ సీఈవో పి.ఎస్‌.సూర్యప్రకాష్‌ తదితర అధికారులు అర్జీలను పరిశీలించారు. అర్జీదారుల వివరాలు వారి మాటల్లోనే ఇలా..

బారులు తీరిన ప్రజలు...
ప్రజలు తమ సమస్యలను పరిష్కరించుకునేందుకు అదిక సంఖ్యలో బారులు తీరారు. దీంతో స్థానిక జడ్‌.పి.సమావేశ మందిరంలో నిర్వహించిన ‘స్పందన’ కార్యక్రమం జనసంద్రాన్ని తలపించింది. గత నాలుగు వారాల నుంచి అధి క సంఖ్యలో వస్తున్నా ఈ సారి వివిద ప్రాంతాల నుంచి ఉదృతంగా వచ్చారు. దీంతో అధికారులు కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేసారు. ముఖ్యంగా ఇంటి పట్టాలకు, రేషన్‌ కార్డులకు, ఫించన్‌లకు వేరు వేరు కౌంటర్లు ఏర్పాటు చేయడంతో అర్జీదారులకు చాలా వరకు సౌలభ్యం లబించిం ది. జిల్లా కలెక్టర్‌ శామ్యూల్‌ ఆనంద్‌ కుమార్, జె. సి. దినేష్‌ కుమార్, డి.ఆర్‌.ఒ. శ్రీలత, జడ్‌ పి.సి. ఇ.ఒ. పి.ఎస్‌.సూర్య ప్రకాష్‌ తదితర అధి కారులు అర్జీలను పరిశీలించారు.

రేషన్‌ కార్డు కోసం వచ్చాం
రేషన్‌ కార్డు దరఖాస్తు చేసుకుందామని వచ్చాం. చాలా సులభంగా పని అయిపోయింది. గత టీడీపీ ప్రభుత్వంలోనూ అనేక సార్లు దరఖాస్తు  చేసినా ఫలితం లేదు. ఇప్పుడు జగనన్న అభయ హస్తం మాకు ఎంతో భరోసా ఇచ్చింది. ఐదేళ్ల రేషన్‌ కార్డు కల నెరవేరుతుందని ఆశిస్తున్నాం. –కె.అనిత, కోపల్లి గ్రామం, తెనాలి మండలంపరిహారం ఇప్పించండి

పరిహారం ఇప్పించండి..
మాది వ్యవసాయ కుటుంబం. పంట కోసం తీసుకున్న అప్పులు తీరకపోవడంతో నా భర్త పమిడిమళ్ల వీరులు గత నెల 1వ తేదీన పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసున్నాడు. నాకు ఇద్దరు పిల్లలు. పోషణ భారంగా ఉంది. అధికారులను కలిసినా పట్టించుకోవడంలేదు. ప్రభుత్వం ఆత్మహత్య చేసుకున్న రైతులకిచ్చే పరిహారం ఇప్పించి ఆదుకోవాలి. –పి.కళ్యాణి, మోతడక గ్రామం 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top