'విభజనతో 220 సినిమాలు ఆగిపోయాయి' | Andhra Pradesh film industry suffers huge losses due state bifurcation | Sakshi
Sakshi News home page

'విభజనతో 220 సినిమాలు ఆగిపోయాయి'

Feb 26 2014 11:00 AM | Updated on Sep 27 2018 5:59 PM

'విభజనతో 220 సినిమాలు ఆగిపోయాయి' - Sakshi

'విభజనతో 220 సినిమాలు ఆగిపోయాయి'

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తెలుగు చిత్ర పరిశ్రమకు గట్టి దెబ్బ అని చిత్ర నిర్మాత, తెలుగుదేశం పార్టీ నాయకుడు అంబికా కృష్ణ తెలిపారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తెలుగు చిత్ర పరిశ్రమకు గట్టి దెబ్బ అని చిత్ర నిర్మాత, తెలుగుదేశం పార్టీ నాయకుడు అంబికా కృష్ణ తెలిపారు. బుధవారం తిరుమలలో ఆయన విలేకర్లతో మాట్లాడుతూ... చిన్న సినిమాలు ఇప్పటికే అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని, విభజనతో ఆ ఇబ్బందులు మరింత తీవ్ర మయ్యాయని అన్నారు.

 

దాదాపు 220 సినిమాలు అర్థంతరంగా నిలిచిపోయాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. విభజనతో చిన్న సినిమాల నిర్మాతలకు తీవ్ర నష్టం వాటిల్లిందన్నారు. అంతకు ముందు అంబికా కృష్ణ కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement