breaking news
suffers huge losses
-
ప్రభుత్వం చేతికి హైదరాబాద్ మెట్రో రైల్
-
'విభజనతో 220 సినిమాలు ఆగిపోయాయి'
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తెలుగు చిత్ర పరిశ్రమకు గట్టి దెబ్బ అని చిత్ర నిర్మాత, తెలుగుదేశం పార్టీ నాయకుడు అంబికా కృష్ణ తెలిపారు. బుధవారం తిరుమలలో ఆయన విలేకర్లతో మాట్లాడుతూ... చిన్న సినిమాలు ఇప్పటికే అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని, విభజనతో ఆ ఇబ్బందులు మరింత తీవ్ర మయ్యాయని అన్నారు. దాదాపు 220 సినిమాలు అర్థంతరంగా నిలిచిపోయాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. విభజనతో చిన్న సినిమాల నిర్మాతలకు తీవ్ర నష్టం వాటిల్లిందన్నారు. అంతకు ముందు అంబికా కృష్ణ కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు.