సీఎస్ టక్కర్ పదవీకాలం పొడిగింపు | Andhra pradesh chief secretary Tucker gets three months extension | Sakshi
Sakshi News home page

సీఎస్ టక్కర్ పదవీకాలం పొడిగింపు

Aug 30 2016 7:34 PM | Updated on Aug 18 2018 6:32 PM

సీఎస్ టక్కర్ పదవీకాలం పొడిగింపు - Sakshi

సీఎస్ టక్కర్ పదవీకాలం పొడిగింపు

ఏపీ సీఎస్ టక్కర్‌ పదవీ కాలాన్ని కేంద్ర ప్రభుత్వం మరో మూడు నెలలు పొడిగించింది.

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.పి. టక్కర్‌ పదవీ కాలాన్ని కేంద్రం మరో మూడు నెలలు పొడిగించింది. మంగళవారం ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. కాగా షెడ్యూల్‌ ప్రకారం ఆయన ఈ నెల 31న రిటైర్‌ కావాల్సి ఉంది. కాగా టక్కర్ ను మరో ఆరునెలల పాటు కొనసాగించాలని ఏపీ సీఎం చంద్రబాబు కేంద్రానికి లేఖ రాశారు. అయితే ఒక విడతలో మూడు నెలలు మాత్రమే కొనసాగించేందుకు అవకాశముంది. ఈ ఏడాది నవంబరు 30 వరకూ టక్కర్‌ సీఎ్‌స్ గా కొనసాగుతారు. కాగా తెలంగాణ సీఎస్ రాజీవ్ శర్మ పదవీ కాలం కూడా మూడు నెలలపాటు కేంద్ర ప్రభుత్వం పొడిగించిన విషయం తెలిసిందే.

 

Advertisement
 
Advertisement
Advertisement