ఈ నెల 20న ఏపీ కేబినెట్‌ భేటీ

Andhra Pradesh Cabinet Meeting On 20th January - Sakshi

సాక్షి, అమరావతి : ఈనెల 20న ఆంధ్రప్రదేశ్‌ మంత్రివర్గ సమావేశం జరుగనుంది. ఉదయం 9..30 గంటలకు సమాశమయ్యే మంత్రివర్గం హైపవర్‌ కమిటీ నివేదికపై చర్చించనుంది. అనంతరం ఉదయం 11 గంటలకు రాష్ట్ర శాసనసభ ప్రత్యేక సమావేశం జరగనుంది. అలాగే, 21వ తేదీ ఉదయం 10 గంటలకు శాసన మండలి సమావేశం జరుగుతుంది. పరిస్థితులను బట్టి శాసనసభ మరో రోజు అదనంగా 21న కూడా సమావేశం నిర్వహించే అవకాశం ఉన్నట్టు అధికార వర్గాల ద్వారా తెలిసింది. మండలి సమావేశం మాత్రం ఒకే రోజుతో ముగిస్తారు. ఈ ప్రత్యేక సమావేశాల్లో రాజధాని, రాష్ట్ర సమగ్రాభివృద్ధికి సంబంధించి జీఎన్‌ రావు, బీసీజీ నివేదికలను రాష్ట్ర ప్రభుత్వం ఉభయ సభల్లో ప్రవేశపెట్టనుంది. హైపవర్‌ కమిటీ కూడా తన నివేదికను సభలో ప్రవేశపెట్టే అవకాశాలున్నాయి. ఈ సందర్భంగా రాజధాని, అభివృద్ధి వికేంద్రీకరణ అంశాలపై సమగ్ర చర్చ చేపట్టనున్నట్లు సమాచారం. 
(చదవండి : 20న అసెంబ్లీ ప్రత్యేక సమావేశం)

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top