ఏపీలో ‘ఫ్లెమింగో’ ఎగిరింది.. | Andhra 'Flamingo' blown .. | Sakshi
Sakshi News home page

ఏపీలో ‘ఫ్లెమింగో’ ఎగిరింది..

Jan 10 2015 2:51 AM | Updated on Sep 2 2017 7:27 PM

ఏపీలో ‘ఫ్లెమింగో’ ఎగిరింది..

ఏపీలో ‘ఫ్లెమింగో’ ఎగిరింది..

ఆంధ్రప్రదేశ్‌లోని ప్రసిద్ధ పక్షుల పండగ ఫ్లెమింగో ఫెస్టివల్ శుక్రవారం సూళ్లూరుపేటలో ఘనంగా ప్రారంభమైంది.

ఆంధ్రప్రదేశ్‌లోని ప్రసిద్ధ పక్షుల పండగ ఫ్లెమింగో ఫెస్టివల్ శుక్రవారం సూళ్లూరుపేటలో ఘనంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా రాష్ట్ర మున్సిపల్ మంత్రి నారాయణ మాట్లాడుతూ పులికాట్ సరస్సును రక్షించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. సరస్సు బాగుంటే విదేశీ పర్యాటకులు పక్షుల పండగకు వస్తారన్నారు. 2016లో జరిగే పండుగనాటికి పులికాట్, ఇరకం, నేలపట్టు ప్రాంతాలను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తామని చెప్పారు. రాష్ట్రంలో పర్యాటకాన్ని అభివృద్ధి చేసేందుకు సీఎం చంద్రబాబు సింగపూర్‌ను మోడల్‌గా తీసుకున్నారని తెలిపారు. రాష్ట్రంలో టూరిజం అభివృద్ధికి ప్రత్యేక సర్క్యూట్లు ఏర్పాటు చేస్తామన్నారు.    
- సూళ్లూరుపేట
 

Advertisement
 
Advertisement
Advertisement