సోనియా ప్రతి పుట్టిన రోజున ఓ రాష్ట్రాన్ని విభజిస్తారా? | Andhra employees sangh leaders fire on seemandhra ministers and MPS | Sakshi
Sakshi News home page

సోనియా ప్రతి పుట్టిన రోజున ఓ రాష్ట్రాన్ని విభజిస్తారా?

Oct 6 2013 12:38 PM | Updated on Sep 27 2018 5:59 PM

రాష్ట్ర విభజన విషయంలో కాంగ్రెస్ పార్టీ ఎంపీలు, కేంద్రమంత్రులు సీమాంధ్ర ప్రజలను మోసం చేశారని ఏపీ ఉద్యోగ సంఘాల నేతలు చంద్రశేఖరరెడ్డి, సత్యనారాయణలు ఆరోపించారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన విషయంలో కాంగ్రెస్ పార్టీ ఎంపీలు, కేంద్రమంత్రులు సీమాంధ్ర ప్రజలను మోసం చేశారని ఏపీ ఉద్యోగ సంఘాల నేతలు చంద్రశేఖరరెడ్డి, సత్యనారాయణలు ఆరోపించారు. ఆదివారం హైదరాబాద్లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో వారు మాట్లాడుతూ... సీమాంధ్ర కేంద్రమంత్రులు, ఎంపీలు ప్యాకేజీలకు అమ్ముడుపోయి ప్రజలను నట్టేట ముంచారని ఆవేదన వ్యక్తం చేశారు.

 

కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేస్తామని వారు హెచ్చరించారు. యూపీఏ అధ్యక్షురాలు సోనియా గాంధీ ప్రతి పుట్టిన రోజున ఓ రాష్ట్రాన్ని విభజిస్తారా అని వారు ప్రశ్నించారు. రాజీనామా విషయంలో కేంద్రమంత్రులు నాటాకాలు అడుతున్నారని ఎద్దేవా చేశారు. సమైక్యాంధ్రకు మద్దతుగా తమ భవిష్యత్తు కార్యాచరణ ఈ సాయంత్రం ప్రకటిస్తామని చెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement