అనంత అడుగులన్నీ ఇచ్చాపురం వైపే | Anantapur People Support to YS Jagan Praja Sankalpa Yatra | Sakshi
Sakshi News home page

అనంత అడుగులన్నీ ఇచ్చాపురం వైపే

Jan 9 2019 12:32 PM | Updated on Jan 9 2019 12:32 PM

Anantapur People Support to YS Jagan Praja Sankalpa Yatra - Sakshi

జగన్‌తో కలిసి నడుస్తున్న శ్రీధర్‌రెడ్డి, శంకర్‌నారాయణ, సిద్దారెడ్డి, మాజీ ఎమ్మెల్యే గురునాథరెడ్డి

అనంతపురం సప్తగిరి సర్కిల్‌: 341 రోజులు..3648 కి.మీ సాగిన చారిత్రాత్మక పాదయాత్ర. ప్రజాభిమానమే దన్నుగా ఓ పథకుడు సాగించిన ‘ప్రజాసంకల్పయాత్ర’ ఈ మహోన్నత యాత్ర నేడు తుది ఘట్టానికి చేరుకుంది. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో నిర్వహిస్తోన్న ఈ అపురూప ఘట్టాన్ని తిలకించేందుకు..తమ అభిమాన నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కలుసుకునేందుకు అనంత వాసులంతా భారీగా తరలివెళ్లారు. ఇప్పటికే కొందరు ఇచ్చాపురం చేరుకున్నారు.  
అనంతపురం అర్బన్‌ సమన్వయకర్త అనంత వెంకట్రామిరెడ్డి, అనంతపురం పార్లమెంటు సమన్వయకర్త తలారి పీడీ రంగయ్య, ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే గురునాథరెడ్డి, నాయకులు చవ్వా గోపాల్‌రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహాలక్ష్మీ శ్రీనివాస్, పెన్నోబిలేసు, మీసాల రంగన్నలతో పాటు పలువురు నాయకులు, అభిమానులు బయలుదేరారు.  
ధర్మవరం నియోజకవర్గ సమన్వయకర్త కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి, వైఎస్సార్‌సీపీ రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి వేలూరి రామాంజినేయులు, బీసీ సెల్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటి సూర్యప్రకాష్‌బాబు బయలుదేరి వెళ్లిన వారిలో ఉన్నారు.
మడకశిర నియోజకవర్గ సమన్వయకర్త, ఎమ్మెల్యే డాక్టర్‌ తిప్పేస్వామి, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి రంగేగౌడ్, మాజీ మంత్రి నర్సేగౌడ్‌ తదితరులు బయలుదేరి వెళ్లారు.  
హిందూపురం నియోజకవర్గం నుంచి సమన్వయకర్త అబ్దుల్‌ఘని, హిందూపురం పార్లమెంటు సమన్వయకర్త నదీం అహమ్మద్, నాయకులు ప్రభాకర్‌రెడ్డి, జగన్‌మోహన్‌రెడ్డి, నరసింహారెడ్డి తదితరులు ఇచ్చాపురం వెళ్లారు.  
కదిరి నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్‌ సిద్ధారెడ్డి, వైఎస్సార్‌సీపీ సీఈసీ సభ్యులు పూల శ్రీనివాసరెడ్డి, జక్కల ఆదిశేషులు తదితరులు ప్రజాసంకల్పయాత్ర ముగింపు సభలో పాల్గొనేందుకు వెళ్లారు.  
కళ్యాణదుర్గం నియోజకవర్గ నుంచి సమన్వయకర్త ఉషాశ్రీచరణ్, వైఎస్సార్‌సీపీ జిల్లా ప్రచార విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శి నరేంద్రరెడ్డి, నాయకులు శెట్టూరు మధుసుధన్‌రెడ్డి, రామచంద్రారెడ్డి, సుధాకర్, అశోక్, రామ్మోహన్‌రెడ్డి, కుందుర్పి నుంచి దివాకర్‌రెడ్డి, రాయుడు, బ్రహ్మసముద్రం నుంచి నరేష్, బాలయ్య, మంజునాథ్‌చౌదరి తదితరులు ఇచ్చాపురం వెళ్లారు.  
పుట్టపర్తి నియోజకవర్గ సమన్వయకర్త దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ జాతీయ కార్యదర్శి కడపల శ్రీకాంత్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ నాయకులు ధూపంపల్లి నరసింహరెడ్డి, కృష్ణారెడ్డి, కత్తి జయచంద్రారెడ్డి ఇప్పటికే ఇచ్చాపురం చేరుకున్నారు.  
రాయదుర్గం నియోజకవర్గ సమన్వయకర్త కాపు రామచంద్రారెడ్డి, వైఎస్సార్‌సీపీ రైతు విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌని ఉపేంద్రరెడ్డి, కణేకల్లు మాజీ ఎంపీపీ రాజగోపాల్‌రెడ్డి, బొమ్మనహళ్‌ మాజీ ఎంపీపీ లాలుసాబ్, కణేకల్లు మాజీ జడ్పీటీసీ సభ్యుడు నాగిరెడ్డి, కాంట్రాక్టర్లు కాంతారెడ్డి, నాగభూషణం, ఇల్లూరు శ్రీనివాసులు తదితరులు పార్టీ కార్యకర్తలతో కలిసి శ్రీకాకుళం బయలుదేరారు.  
గుంతకల్లు నుంచి నియోజకవర్గ సమన్వయకర్త వై వెంకట్రామిరెడ్డి, మంజునాథరెడ్డి,  మాజీ మార్కెట్‌ యార్డు చైర్మన్‌ చిన్నబాబు, వైఎస్సార్‌సీపీ టౌన్‌ కన్వీనర్‌ ఎద్దుల శంకర్, పామిడి చుక్కలూరు దిలిప్‌రెడ్డి, సీఎం బాషాలు బయలుదేరారు.
శింగనమల నుంచి పార్టీ సమన్వయకర్త జొన్నలగడ్డ పద్మావతి, వైఎస్సార్‌సీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు ఆలూరు సాంబశివారెడ్డి, శ్రీకాంత్, రఘునాథరెడ్డి, నాగేశ్వరరెడ్డి, పుట్లూరు రాఘవరెడ్డి, నరేష్, రామచంద్రారెడ్డి, నగేష్, సూర్యనారాయణ, నరసయ్య, పెద్దన్న వెళ్లారు.
రాప్తాడు నుంచి నియోజకవర్గ సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి, రాప్తాడు జెడ్పీటీసీ సభ్యుడు వెన్నపూస రవీంద్రారెడ్డి, వైఎస్సార్‌సీపీ నాయకులు మహానందరెడ్డి, గంగుల భానుమతి, రామాంజినేయులు, గోపాల్‌రెడ్డి, నాగముని, గంగుల సుధీర్‌రెడ్డి తదితరులు వెళ్లారు.
తాడిపత్రి నియోజకవర్గ సమన్వయకర్త కేతిరెడ్డి పెద్దారెడ్డి, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శులు రమేష్‌రెడ్డి, పైలా నరసింహయ్య, వీఆర్‌ రామిరెడ్డి, రైతు సంఘం జిల్లా కార్యదర్శి వెంకట్రామిరెడ్డి, యువజన విభాగం జిల్లా కార్యదర్శి జబ్బార్‌బాషాలు శ్రీకాకుళం బయలుదేరి వెళ్లారు.
పెనుకొండ నియోజకవర్గ నుంచి సమన్వయకర్త మాలగుండ్ల శంకరనారాయణ, వైఎస్సార్‌సీపీ నాయకులు సుధాకర్‌రెడ్డి తదితరులు తరలివెళ్లారు.
ఉరవకొండ నియోజకవర్గంలోని ఆయా మండలాల నాయకులు పెద్ద ఎత్తున బయలుదేరి వెళ్లారు.  

అధినేతతో ‘అనంత’ నేతలు
అనంతపురం సప్తగిరి సర్కిల్‌: వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర బుధవారంతో ముగుస్తున్న నేపథ్యంలో ఆ మహావేడుకలో పాల్గొనేందుకు జిల్లాకు చెందిన పలువురు నేతలు మంగళవారమే శ్రీకాకుళం జిల్లాకు చేరుకున్నారు. ఈ క్రమంలోనే ఆ పార్టీ అనంతపురం పార్లమెంట్‌ సమన్వయకర్త తలారి పీడీ రంగయ్య, వైఎస్సార్‌సీపీ జాతీయ కార్యదర్శి కడపల శ్రీకాంత్‌రెడ్డి, ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్‌రెడ్డి, కదిరి సమన్వయకర్త సిద్దారెడ్డి, పుట్టపర్తి సమన్వయకర్త దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి, పెనుకొండ సమన్వయకర్త, హిందూపురం పార్లమెంట్‌ అధ్యక్షుడు మాలగుండ్ల శంకర్‌నారాయణ పాదయాత్రలో జగన్‌ కలిసి ఆయన వెంట నడిచారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement