
సాక్షి, అనంతపురం: నామినేటెడ్ పదవుల్లో 50 శాతం రిజర్వేషన్లు దేశంలో ఎక్కడా లేవని డిప్యూటీ సీఎం అంజాద్ బాషా అన్నారు. ఆయన గురువారం మీడియాతో మట్లాడుతూ.. వెనుకబడిన వర్గాలకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అని ఆయన కొనియాడారు. మహిళలకు సాధికారత కల్పించిన ఘనత సీఎం జగన్‌దని అన్నారు. వ్యవసాయానికి రూ. 35 వేల కోట్లు కేటాయించి రైతులను ఆదుకున్నారని అంజాద్ బాషా అన్నారు.
ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు దిగజారుడు రాజకీయాలు చేయటం బాధాకరమన్నారమని అంజాద్ బాషా అన్నారు. హజ్ యాత్రకు సబ్సిడీ కింద రూ. 60 వేలు అందజేస్తున్నామని ఆయన తెలిపారు. చంద్రబాబు ఒక్క మైనార్టీకి మంత్రి పదవి ఇవ్వలేదు. ఎన్ఆర్‌సీ, ఎన్‌పీఆర్‌లను ఏపీలో అమలు చేయమని ఆయన అన్నారు. ముస్లిం మైనారిటీలు ఆందోళన చెందాల్సిన పనిలేదని అంజాద్ బాషా చెప్పారు. ముస్లింలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అండగా ఉంటారని అంజాద్ బాషా అన్నారు.