ఆధార్‌లో తప్పుల సవరణ ఇలా.. | amendment in errors in aadhar | Sakshi
Sakshi News home page

ఆధార్‌లో తప్పుల సవరణ ఇలా..

Aug 18 2014 2:13 AM | Updated on Jul 11 2019 7:48 PM

ఆధార్‌లో తప్పుల సవరణ ఇలా.. - Sakshi

ఆధార్‌లో తప్పుల సవరణ ఇలా..

ఆధార్‌కార్డు బాధలు తప్పాయిరా దేవుడా అనుకుంటున్న లోపే రాష్ట్ర ప్రభుత్వం మళ్లీ ఆధార్ ప్రక్రియను తెరపైకి తెచ్చింది.

అద్దంకి: ఆధార్‌కార్డు బాధలు తప్పాయిరా దేవుడా అనుకుంటున్న లోపే రాష్ట్ర ప్రభుత్వం మళ్లీ ఆధార్ ప్రక్రియను తెరపైకి తెచ్చింది. దీంతో ఎక్కడివారు అక్కడ ఆధార్ కార్డు నమోదు కోసం పరుగులు పెడుతున్నారు. ఈ నేపథ్యంలో కొన్ని కార్డుల్లో వివిధ వివరాలు తప్పులుగా నమోదవుతున్నాయి. అయితే వీటిని సవరించుకొనేందుకు అవకాశం ఉంది. కానీ కార్డులో ఫొటో మాత్రం మార్పు చేయలేం. పేరు, స్త్రీ పురుష లింగాలు, పుట్టిన తేదీ, చిరుమనా, ఫోన్ నంబర్లను తిరిగి మార్పు చేసుకోవచ్చు.
 
 ఆన్‌లైన్ విధానం...
 htpp:uidai.gov.in/updateyouradhaardata.htmను క్లిక్ చేయాలి. తరువాత కొన్ని ముఖ్య సూచనలు వస్తాయి. వాటిని బాగా చదవాలి. అనంతరం అప్‌డేట్, కరెక్షన్, రిక్వెస్ట్ ప్లీజ్ ఆప్షన్ల మీద క్లిక్ చేయాలి. మీకు నచ్చిన ఆప్షన్‌లో ఆధార్ కార్డు నంబరును ఎంటర్ చేయాలి. ఇప్పుడు దాని కింద ఇచ్చిన వెరిఫికేషన్ కోడ్‌ను నమోదు చేయాలి. ఈ సమయంలో మీ మొబైల్‌కు వన్‌టైమ్ పాస్‌వర్డ్ (ఓటీపీ) వస్తుంది. దీనిని ఎంటర్ చేయగానే మీరు కార్డులో ఏమి మార్పు చేయదలచుకున్నారో ఆ వివరాలపై క్లిక్ చేయాలి.

తరువాత సంబంధించిన ఫారం డిస్‌ప్లే అవుతుంది. ఆ ఫారాన్ని పూర్తి చేశాక సబ్‌మిట్, అప్‌డేట్, రిక్వెస్ట్ ఆప్షన్లను క్లిక్ చేయాలి. డాక్యుమెంటేషన్ ఆప్షన్‌లో మార్పు చేయాలనుకుంటున్న పత్రాలను అప్‌లోడ్ చేయాలి. మీకు అందుబాటులో ఉన్న సర్వీస్ ప్రొవైడర్‌ను ఎంపిక చేసుకుని ఎంటర్ చేయాలి. ఇప్పడు మీకు అప్‌డేట్ రిక్వెస్ట్ నంబరు వస్తుంది. ఈ నంబరులో మీ ఆధార్ కార్డులో ప్రస్తుత పరిస్థితి ఏమిటో తెలుసుకోవచ్చు.
 
 ఆఫ్‌లైన్ విధానం (పోస్ట్ ద్వారా)
 htpp:uidai.gov.in/images/applicationform11102012pdfను క్లిక్ చేస్తే సంబంధిత ఫార ం వస్తుంది. దానిలో మీ వివరాలు నమోదు చేసి సంబంధిత దరఖాస్తును జతచేయాలి. నిర్దేశిత కాలంలో ప్రాంతీయ భాషలో కూడా పూరించాలి. ఒక ఎన్వోలప్‌పై రిక్వెస్ట్ ఫర్ ఆధార్ అప్‌డేట్ అండ్ కరక్షన్ అని రాసి పాంతీయ కార్యాలయానికి పోస్ట్‌లో పంపాలి. ఆన్ లైన్ విధానంలో ఫారం పూరించే సమయంలో కొన్ని ఆప్షన్లు, గ్రామం, పిన్‌కోడ్, టౌన్, సిటీ, జిల్లా, రాష్ట్రం వివరాలు రాకుంటే పోస్టు ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. అటెస్ట్ చేయాల్సిన విషయంలో రెండు విధానాలూ ఒకేరకంగా ఉంటాయి.
 
 సూచనలు- జాగ్రత్తలు
 వన్‌టైమ్ పాస్‌వర్డ్‌కు కేవలం 15 నిముషాలు మాత్రమే వ్యాలిడిటీ ఉంటుంది. ప్రాంతీయ భాషకు అనుగుణంగా సర్వీస్ ప్రొవైడర్‌ను ఎంచుకోవాలి. ఫారం పూర్తి చేసేటప్పుడు ప్రాంతీయ భాషలో తప్పులు వస్తుంటే, సంబంధిత ఆప్షన్ వద్ద కర్సర్ పెట్టి కీ బోర్డులోని ట్యాబ్‌బార్‌ను ప్రెస్ చేయాలి. ఇప్పడు కొన్ని ఆప్షన్లు వస్తాయి. వీటిలో సరైనది సెలక్ట్ చేసుకోవచ్చు. ఐదేళ్ల లోపు పిల్లలకు తల్లిదండ్రుల్లో ఒకరి సంతకం సరిపోతుంది.

ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసేటప్పుడు రిఫ్రెష్ చేయకూడదు. పేరుకు ముందు ఎలాంటి హోదాలు, వివరాలు చేర్చకూడదు. ఉదాహరణకు, డాక్టర్, శ్రీ, శ్రీమతి వంటివి. అడ్రెస్ స్పష్టంగా ఉండాలి. పుట్టిన తేదీ మార్చుకోవడానికి ఒక్కసారే అవకాశం ఉంటుంది. మొబైల్ నంబరు మార్పు మాత్రం ఫోన్ ద్వారా మెసేజ్ వస్తుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement