ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలపై సందిగ్ధత ఇంకా వీడలేదు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలపై సందిగ్ధత ఇంకా వీడలేదు. ప్రభుత్వం జారీచేసిన జీఓ నెం. 57ను తప్పుపడుతూ ఏపీ పశు సంవర్ధక శాఖ ఉద్యోగులు హైకోర్టును ఆశ్రయించారు. దాంతో బదిలీల జీవోపై హైకోర్టు స్టే విధించింది.
ఈ స్టేను ఎత్తేయాలంటూ ఏపీ సర్కారు హైకోర్టును ఆశ్రయించింది. అయితే ఇంకా దానిపై ఎలాంటి నిర్ణయం ఇంతవరకు వెలువడలేదు. దాంతో ప్రస్తుతానికి బదిలీలపై ఆంధ్రప్రదేశ్ మంత్రులు ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో.. మిగిలిన శాఖల ఉద్యోగుల పరిస్థితి గందరగోళంలో పడింది.