ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కత్తెర పాలన జరుగుతోందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఆకేపాటి అమర్నాథరెడ్డి విమర్శించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కత్తెర పాలన జరుగుతోందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఆకేపాటి అమర్నాథరెడ్డి విమర్శించారు. ప్రతి పథకం విషయంలోనూ కోతలు పెడుతూ పోతున్నారని, ఏదో పేరు చెప్పి అన్నీ తగ్గించేస్తున్నారని ఆయన అన్నారు.
ఎన్నికల సమయంలో అనేక హామీలు ఇచ్చినా, వాటిలో ఏ ఒక్కటీ నెరవేర్చడం లేదని, ఇచ్చిన హామీలను నెరవేర్చని పక్షంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సారథ్యంలో ప్రజల పక్షాన తీవ్రస్థాయిలో ఆందోళనలు చేస్తామని ఆకేపాటి అమర్నాథ రెడ్డి స్పష్టం చేశారు.