ప్రతినిధి బృందాన్ని ఢిల్లీకి తీసుకెళతా: సీఎం కిరణ్‌ | Along with delegation to Delhi: says CM Kiran | Sakshi
Sakshi News home page

ప్రతినిధి బృందాన్ని ఢిల్లీకి తీసుకెళతా: సీఎం కిరణ్‌

Aug 6 2013 4:28 AM | Updated on Aug 13 2018 4:01 PM

ప్రతినిధి బృందాన్ని ఢిల్లీకి తీసుకెళతా: సీఎం కిరణ్‌ - Sakshi

ప్రతినిధి బృందాన్ని ఢిల్లీకి తీసుకెళతా: సీఎం కిరణ్‌

సచివాలయ సీమాంధ్ర ఉద్యోగుల ఫోరం ప్రతినిధి బృందాన్ని తన నేతృత్వంలో ఢిల్లీకి తీసుకెళ్లడానికి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అంగీకరించారు.Simandhra

 సచివాలయ సీమాంధ్ర ఉద్యోగులకు సీఎం హామీ
 సాక్షి, హైదరాబాద్: సచివాలయ సీమాంధ్ర ఉద్యోగుల ఫోరం ప్రతినిధి బృందాన్ని తన నేతృత్వంలో ఢిల్లీకి తీసుకెళ్లడానికి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అంగీకరించారు. ఫోరం చైర్మన్ యు.మురళీకృష్ణ నేతృత్వంలో డి.మురళీమోహన్, వెంకటసుబ్బయ్య, కృష్ణయ్య, ఏడుకొండలు, రవీందర్, బెన్సన్ తదితరులతో కూడిన ప్రతినిధి బృందం సోమవారం ముఖ్యమంత్రిని సీఎం క్యాంపు కార్యాలయంలో కలిసింది.
 
 ఉద్యోగుల అంశాన్ని కనీసం పరిగణనలోనికి కూడా తీసుకోకపోవడం వల్లే తమకు బాధ కలిగిందని ఉద్యోగులు ఆయనకు వివరించారు. తమ ప్రతినిధి బృందాన్ని ఢిల్లీకి తీసుకెళ్లాలని, తమ బాధను, సీమాంధ్రుల వాణిని ఢిల్లీ పెద్దలకు వివరిస్తామని కోరగా, ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారు. ఢిల్లీకి వెళ్లే ప్రతినిధి బృందానికి నేతృత్వం వహించడానికీ సమ్మతించారు. త్వరలో తేదీ నిర్ణయించి తెలియజేస్తానని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement