
ఓటు కోసం
పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికలకు త్వరలోనే నోటిఫికేషన్ వెలువడుతుందన్న ప్రచారంతో జిల్లాలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది.
రాజకీయ నేతలలో మొదలైన కలకలం
ఎన్నికల నోటిఫికేషన్‌పైనే సర్వత్రా చర్చ
అభ్యర్థుల ఎంపిక కోసం పార్టీల కసరత్తు
అగ్రనేతల చుట్టూ ఆశావహుల చక్కర్లు
బరిలో దిగేందుకు ఎవరి వ్యూహం వారిదే
రంగులు మారుతున్న రాజకీయం
బ్యాలెట్ పోరు అందరికీ ప్రతిష్టాత్మకమే
‘తెలంగాణ’ నేపథ్యంలో సన్నాహాలు
ఆచితూచి నాయకుల అడుగులు
జనం ఆదరణ పొందేందుకు యత్నాలు
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయం తేలిపోవడంతో రాజకీయ పార్టీలకు ఎన్నికల జ్వరం పట్టుకుంది.
నేతలలో కలకలం మొదలైంది. దాదాపూ అన్ని పార్టీల నాయకులు బ్యాలెట్ సమరానికి సిద్ధమవుతున్నారు. జనం ఆదరణ పొందేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు.ఆశావహులు టిక్కెట్ల వేటలోనిమగ్నమయ్యారు. మొత్తానికి జిల్లాలో రాజకీయం గరం గరంగా మారింది.
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ :
పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికలకు త్వరలోనే నోటిఫికేషన్ వెలువడుతుందన్న ప్రచారంతో జిల్లాలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లుకు ఆమోదం లభించినప్పటికీ, ఆ ప్రక్రి య పూర్తయ్యేందుకు మూడు నెలల సమయం పట్టవచ్చని, ఉమ్మడి రాష్ట్రంలోనే ఎన్నికలు ని ర్వహించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయ ని కేంద్రమంత్రి షిండే ప్రకటించారు. ఎన్నికల సంఘం కూడా ఇదే విషయాన్ని తేల్చి చెప్పిం ది. ఈ నేపథ్యంలో ఎన్నికలు ఖాయమని తేల డంతో రాజకీయ పార్టీలు తమ వ్యూహాల కు ప దును పెడుతున్నాయి. వారం రోజులలో నోటిఫికేషన్ వెలువడవచ్చన్న ప్రచారంతో ఆయా పార్టీలు అభ్యర్థుల ఎంపికలో తలమునకలయ్యాయి.
నేతల జనం బాట
2014 సార్వత్రిక ఎన్నికలు అన్ని పార్టీలు, నేతలకు కీలకం కానున్నాయి. అందుకే నేతలంతా జనం బాట పడుతున్నా రు. ఆశావహులు టిక్కెట్ల కోసం తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారు. మరోవైపు ఆయా పార్టీలు దీటైన అభ్యర్థులను పోటీలో దింపేందుకు కసరత్తును ప్రారంభించాయి. ప్రతి నియోజకవర్గంలోనూ, అన్ని పార్టీలలో టిక్కె ట్ ఆశిస్తున్నవారి సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది. ప్రధాన పార్టీల నుం చి టికెట్లు ఆశిస్తున్న ఆశావహులు అగ్రనేతల చుట్టూ చక్కర్లు కొడుతుం డట ం, పోటాపోటీ ప్రయత్నాలు చేస్తుండటంతో జిల్లాలో రాజకీయం రసవత్తరంగా మారింది.
అభ్యర్థుల ఎంపిక తలనొప్పే
సార్వత్రిక ఎన్నికలలో సత్తచాటడం అన్ని పార్టీలకు ప్రతిష్టాత్మకం కాగా, ఈ సారి అభ్యర్థుల ఎంపిక సైతం అన్ని పార్టీలకు తలనొప్పిగా మారనుంది. తె లంగాణ రాష్ట్రం ఏర్పాటు నేపథ్యంలో కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌ల పొత్తు లేదా విలీనం ఉంటుందనే చర్చ ఉంది. ఇదే సమయంలో బీజేపీ, టీడీపీలు సైతం ఈ ఎన్నికలలో కలిసే నడుస్తాయని అంటున్నారు. ఈ రెండు పరిణామాలు నిజమైతే ఆ నాలుగు పార్టీల అభ్యర్థులకు అన్ని స్థానాల నుంచి రెబల్స్ బెడ ద అనివార్యం. రాష్ట్ర, జాతీయ స్థాయి రాజకీయాలలో కీలకంగా వ్యవహరిం చే నేతలు జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ క్రమంలో పొత్తులు, విలీనం ప్రతిపాదనలు నిజమైతే చాలా మంది సీనియర్లు టికెట్లపై ఆశలు వదులుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.
ముందస్తు వ్యూహాలు
కాంగ్రెస్, టీఆర్‌ఎస్, టీడీపీ, వైఎస్‌ఆర్ సీపీ, బీజేపీతోపాటు వామపక్షాలు ఎ న్నికలలో తలపడేందుకు సమాయత్తమవుతున్నాయి. ముందస్తు వ్యూహాల ను రూపొందించుకుంటున్నాయి. అభ్యర్థుల ఎంపికలో ఆచితూచి ముందడుగు వేస్తున్నాయి. కాంగ్రెస్ పరిశీలకులు జిల్లాలో పర్యటించి వెళ్లారు. టీఆర్ ఎస్‌తో పొత్తు లేదా విలీనం జరిగితే, ఇప్పటికే నలుగురు టీఆర్‌ఎస్, ఇద్దరు కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యేలుండగా, ఇంకా మూడు స్థానాల కేటాయింపు ఆ రెండు పార్టీలలో కీలకం కానుంది. అదేవి ధంగా టీడీపీ, బీజేపీ ఒంటరి పో రుకు సిద్ధమవుతున్నా, ఒకవేళ పొత్తు కుదిరితే ఆ రెండు పార్టీల నేతల మధ్యన సమన్వయం కుదరడం కష్టమేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. దీంతో రెబల్ అభ్యర్థులు బరిలో ఉండటంగానీ, ఆశావహులు ఇతర పార్టీలలో చేరడంగానీ జరగవచ్చని భావిస్తున్నారు. దివంగత నేత డాక్టర్ వైఎస్‌ఆర్ ఆశయసాధన, బడుగుల సంక్షేమం లక్ష్యంగా ఆవిర్భవించిన వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లాలో తమ పార్టీ అభ్యర్థులను రంగంలోకి దింపనుంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆర్మూరులో ‘రైతుదీక్ష’ నిర్వహించి జిల్లా ప్రజలకు చేరువైన విషయం విదితమే.