మూగబోయిన 'వాణి '

Akashvani Announcer Pushpa Raj Died With Illness In YSR Kadapa - Sakshi

ఆకాశవాణి సీనియర్‌ అనౌన్సర్‌

పుష్పరాజ్‌ మృతి

కడప : ఆకాశవాణి కడప కేంద్రంలో సీనియర్‌ అనౌన్సర్‌గా పనిచేస్తున్న కొత్తమాసి పుష్పరాజ్‌(58) గురువారం మృతి చెందారు. ఆయన కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. కొత్తమాసి పుష్పరాజ్‌ 1960వ సంవత్సరం సెప్టెంబరు 17వ తేదిన కర్నూలు జిల్లా మద్దూరులో జన్మించారు.  1991లో అనంతపురం ఆకాశవాణి కేంద్రంలో అనౌన్సర్‌గా విధుల్లో చేరారు.

ఆ తర్వాత 2001లో కడప ఆకాశవాణి కేంద్రానికి బదిలీపై వచ్చారు. 27 ఏళ్ల సుదీర్ఘ ఉద్యోగ జీవితంలో రాయలసీమ వాసులకే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా నాటికలు, కథలు, కథానికలు, రూపకాలు నిర్వహించి శ్రోతల్లో ప్రత్యేక గుర్తింపు సాధించారు. కడప ఆకాశవాణి కేంద్రంలో ప్రతిరోజు ప్రసారమయ్యే హలో అభిరుచి ప్రత్యక్ష కార్యక్రమం ద్వారా ఎందరో శ్రోతల హృదయాల్లో స్థానం సంపాదించారు. చతురతతో, చమత్కార మాటలతో శ్రోతలను ఆకట్టుకుంటూ నవ్వుల వర్షం కురిపించేవారు. పుష్పరాజ్‌కు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఆయన మరణం పట్ల ఆకాశవాణి కడప కేంద్రం అధికారులు, సిబ్బంది, నగర ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top