breaking news
puspa raj
-
మూగబోయిన 'వాణి '
కడప : ఆకాశవాణి కడప కేంద్రంలో సీనియర్ అనౌన్సర్‌గా పనిచేస్తున్న కొత్తమాసి పుష్పరాజ్(58) గురువారం మృతి చెందారు. ఆయన కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. కొత్తమాసి పుష్పరాజ్ 1960వ సంవత్సరం సెప్టెంబరు 17వ తేదిన కర్నూలు జిల్లా మద్దూరులో జన్మించారు. 1991లో అనంతపురం ఆకాశవాణి కేంద్రంలో అనౌన్సర్‌గా విధుల్లో చేరారు. ఆ తర్వాత 2001లో కడప ఆకాశవాణి కేంద్రానికి బదిలీపై వచ్చారు. 27 ఏళ్ల సుదీర్ఘ ఉద్యోగ జీవితంలో రాయలసీమ వాసులకే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా నాటికలు, కథలు, కథానికలు, రూపకాలు నిర్వహించి శ్రోతల్లో ప్రత్యేక గుర్తింపు సాధించారు. కడప ఆకాశవాణి కేంద్రంలో ప్రతిరోజు ప్రసారమయ్యే హలో అభిరుచి ప్రత్యక్ష కార్యక్రమం ద్వారా ఎందరో శ్రోతల హృదయాల్లో స్థానం సంపాదించారు. చతురతతో, చమత్కార మాటలతో శ్రోతలను ఆకట్టుకుంటూ నవ్వుల వర్షం కురిపించేవారు. పుష్పరాజ్‌కు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఆయన మరణం పట్ల ఆకాశవాణి కడప కేంద్రం అధికారులు, సిబ్బంది, నగర ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. -
ఏపీ టీడీపీ రాజ్యసభ అభ్యర్థిగా సుజనా
తిరుపతి: కేంద్రమంత్రి సుజనా చౌదరి మరోసారి రాజ్యసభకు ఎంపిక కానున్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభ అభ్యర్థిగా సుజనా చౌదరి పేరును టీడీపీ ఖరారు చేసింది. ఆదివారం తిరుపతిలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సమావేశంలో రాజ్యసభ ఎన్నికలపై చర్చ జరుగుతోంది. టీడీపీ మరో రాజ్యసభ సీటును మిత్రపక్షమైన బీజేపీకి టీడీపీ కేటాయించింది. కేంద్రమంత్రి సురేష్ ప్రభుకు రాజ్యసభ సీటు ఇచ్చే అవకాశం ఉంది. మూడో రాజ్యసభ సీటు రేసులో మాజీమంత్రి పుష్పరాజ్ పేరు వినిపిస్తోంది. నాల్గో రాజ్యసభ సీటుపై చర్చ కొనసాగుతోంది.