'త్వరలో ఎయిమ్స్కు శంకుస్థాపన' | AIIMS will be inaugurated soon says kamineni | Sakshi
Sakshi News home page

'త్వరలో ఎయిమ్స్కు శంకుస్థాపన'

Nov 7 2015 3:57 PM | Updated on Aug 30 2019 8:37 PM

ఆంధ్రప్రదేశ్‌లోని మంగళగిరిలో ఏర్పాటు చేయనున్న ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైన్ (ఎయిమ్స్)కు త్వరలోనే శంకుస్థాపన చేయనున్నట్లు వైద్యఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ తెలిపారు.

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లోని మంగళగిరిలో ఏర్పాటు చేయనున్న ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్)కు త్వరలోనే శంకుస్థాపన చేయనున్నట్లు వైద్యఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ తెలిపారు. అత్యాధునిక సౌకర్యాలతో కూడిన ప్రాంతీయ వైరాలజీ ల్యాబ్ను గుంటూరులో ఏర్పటు చేయనన్నట్లు మంత్రి తెలిపారు.

అలాగే రాష్ట్రంలో మెరుగైన ఆరోగ్య సేవలను అందించేందుకు నెల్లూరులో ట్రామా కేర్ సెంటర్, అరకులో నేచర్ క్యూర్ ఆసుపత్రులను నిర్మంచనున్నట్లు తెలిపారు. వైరస్ వ్యాధులను ముందుగానే గుర్తించేందుకు అనంతపురం, కడప, కర్నూలు, ప్రకాశం, కాకినాడ ప్రభుత్వాసుపత్రుల్లో వైరాలజీ ల్యాబ్లను ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి ప్రకటించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement