
అది తెలంగాణ రాష్ట్రంలోని ఎంజీబీఎస్ మెట్రో స్టేషన్‌లోని మొదటి అంతస్తు.. మంగళవారం ఉదయం 11.30 గంటల ప్రాంతం.. అమీర్‌పేట నుంచి అక్కడకు రీలోకేట్ అయిన పాస్‌పోర్టు సేవా కేంద్రం (పీఎస్‌కే) ప్రారంభమైంది. కేంద్ర విదేశీ వ్యవహార మంత్రిత్వ శాఖలో (ఎంఈఏ) సంయుక్త కార్యదర్శి హోదాలో ఉన్న చీఫ్ పాస్‌పోర్టు ఆఫీసర్ డాక్టర్ కేజే శ్రీనివాస ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమం ముగిసిన తర్వాత ఫొటో సెషన్ నడిచింది. పాస్‌పోర్టు కార్యాలయం, పీఎస్‌కే ఉద్యోగులు, అతిథులు ఆయనతో ఫొటోలు దిగారు.
టోలిచౌకి నుంచి రాయదుర్గానికి రీలోకేట్ అయిన పీఎస్‌కేను ప్రారంభించాల్సి ఉంది. అందరూ అక్కడకు వెళ్లే హడావుడిలో ఉండగా.. ‘రండి ఫొటో దిగుదాం’ అనే మాట శ్రీనివాస నోటి వెంట వచి్చంది. అక్కడ ఉన్న నాల్గో తరగతి ఉద్యోగులను ప్రత్యేకంగా ఆహా్వనించిన ఆయన రీజనల్ పాస్‌పోర్టు ఆఫీసర్ స్నేహజ జోన్నలగడ్డతో కలిసి ఫొటోలు దిగారు. ‘మా కేంద్రాలు సజావుగా నిర్వహించడానికి మీరూ కీలకమే’ అంటూ ఆ పారిశుద్ధ్య, సెక్యూరిటీ ఉద్యోగులను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఆయన విలక్షణ వ్యక్తిత్వాన్ని చూసి అక్కడి వాళ్లంతా అవాక్కయ్యారు.
ఎవరీ శ్రీనివాస?
బెంగళూరుకు చెందిన కోటేహాల్ జయదేవప్ప శ్రీనివాస మైసూర్ మెడికల్ కాలేజీలో వైద్య విద్యనభ్యసించారు. 2002 బ్యాచ్‌కు చెందిన ఇండియన్ ఫారెన్ సర్వీస్ (ఐఎఫ్‌ఎస్) అధికారి. బెంగళూరులోని రీజనల్ పాస్‌పోర్టు కార్యాలయం నుంచి పాస్‌పోర్టు పొందడానికి శ్రీనివాస 1997లో దరఖాస్తు చేసుకున్నారు. అప్పట్లో దాని కోసం ఉదయం 5 గంటలకే ఆర్‌పీఓ కార్యాలయానికి వెళ్లి గంటల తరబడి క్యూలో నిల్చోవాల్సి వచ్చింది. అన్ని వెరిఫికేషన్లు పూర్తయి, పాస్‌పోర్టు పొందడానికి 60 రోజులు వేచి ఉన్నారు.
ఈ అనుభవాలను దృష్టిలో పెట్టుకున్న శ్రీనివాస తాను ఐఎఫ్‌ఎస్ అధికారి అయిన తర్వాత పాస్‌పోర్టు జారీలో సంస్కరణలపై దృష్టి పెట్టారు. ఈశాన్య రాష్ట్రాల్లో మారుమూల ప్రాంతాలకీ మొబైల్ పాస్‌పోర్టు సేవా వ్యాన్లు మొదలు చిఫ్ బేస్ట్ ఈ–పాస్‌పోర్టుకు రూపం ఇవ్వడంలోనూ పాత్ర కీలక పాత్ర వహించారు..
(చదవండి: ఓవైపు అసిస్టెంట్ కమిషనర్‌గా..మరోవైపు కళాకారిణిగా..)