అనంతపురంలో ఆడమ్ గిల్‌క్రిస్ట్

Adam Gilchrist Visit Anantapur Cricket Stadium - Sakshi

సాక్షి, అనంతపురం: భారత్‌తో క్రికెట్‌కు ప్రోత్సాహం బాగుందని ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్‌ ఆడమ్ గిల్‌క్రిస్ట్ అన్నాడు. గురువారం కర్నూలు జిల్లా తుగ్గలి మండలం పగిడిరాయి గ్రామానికి వెళుతూ మార్గమధ్యలో అనంతపురంలోని ఆర్డీటీ క్రికెట్ స్టేడియంను అతడు సందర్శించాడు. క్రీడా వసతులను పరిశీలించాడు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఆర్డీటీ క్రికెట్ స్టేడియం అద్భుతంగా ఉందని కితాబిచ్చాడు. ఇండియాలో క్రికెట్‌ను బాగా ఆరాధిస్తున్నారని వ్యాఖ్యానించాడు.

ప్రస్తుతం ప్రపంచ క్రికెట్‌లో భారత జట్టు ప్రదర్శన చాలా బాగుందని, మిగిలిన జట్లకు టీమిండియా ప్రమాదకరంగా మారిందన్నారు. ఆసీస్‌ జట్టు ఆటతీరుపై స్పందిస్తూ.. సహజంగా ఒక్కోసారి కొన్ని మార్పులు జరుగుతుంటాయని, ఫీల్డింగ్‌లో కాస్త తడబాటు ఉందని గిల్‌క్రిస్ట్ అభిప్రాయపడ్డాడు. అతడి వెంట ఆర్డీటీ ప్రోగ్రాం డైరెక్టర్‌ మాంఛో ఫెర్రర్‌ తదితరులు ఉన్నారు. కాగా, కర్నూలు జిల్లా తుగ్గలి మండలం పగిడిరాయి గ్రామం సోలార్‌ విద్యుత్‌ సదుపాయం ఏర్పాటుకు పైలట్‌ ప్రాజెక్టు కింద ఎంపికైంది. విలేజ్‌ ఎనర్జీ సంస్థ కార్యక్రమాలను పర్యవేక్షించేందుకు గిల్‌క్రిస్ట్‌ ఇక్కడికి వచ్చారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top