పాక్ ఉగ్రవాద చర్యలను మూకుమ్మడిగా తిప్పికొట్టాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి మన్నవ ....
కొరిటెపాడు: పాక్ ఉగ్రవాద చర్యలను మూకుమ్మడిగా తిప్పికొట్టాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి మన్నవ సుబ్బారావు పేర్కొన్నారు. బృందావన్ గార్డెన్స్‌లోని కమ్మజన సేవాసమితి ఆధ్వర్యంలో పఠాన్ కోట్ అమరవీరులకు బుధవారం శ్రద్ధాంజలి ఘటించి సంతాపసభ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ దేశ సమగ్రత, సమైక్యత, భద్రతను కాపాడేందుకు నిరంతరం సైనికులు పనిచేస్తున్నారన్నారు. భద్రత వైఫల్యాలు ఉన్నప్పటికీ మన వీరజవానులు ఈ దాడులను తిప్పికొట్టారని, భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా చూడాల్సిన బాధ్యత అందరిపై వుందన్నారు.
కమ్మజన సేవాసమితి కార్యదర్శి సామినేని కోటేశ్వరరావు మాట్లాడుతూ చనిపోయిన సైనికుల కుటుంబాలకు కమ్మజన సేవాసమితి పాలకవర్గం, విద్యార్ధినులు లక్ష రూపాయలు కలెక్టర్ ద్వారా అందజేస్తున్నట్లు తెలిపారు. విద్యార్ధినులు క్యాండిల్స్ వెలిగించి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో గోరంట్ల పున్నయ్యచౌదరి, పావులూరి కృష్ణకుమార్, వంకాయలపాటి బలరామకృష్ణయ్య, విద్యార్ధినులు పాల్గొన్నారు.