
విమానంలో ప్రయాణికుడితో ప్రకాష్‌రాజ్ గొడవ
చెన్నై వెళ్లే విమానంలో తోటి ప్రయాణికుడితో ప్రముఖ సినీ నటుడు ప్రకాష్ రాజ్ గొడవకు దిగారు. బుధవారం రాత్రి 7. 30 గంటలకు ఆయన శంషాబాద్ అంతర్జాతీయ విమానంలో చెన్నై వెళ్లే ఎయిర్ ఇండియా విమానం ఎక్కారు.
హైదరాబాద్: చెన్నై వెళ్లే విమానంలో తోటి ప్రయాణికుడితో ప్రముఖ సినీ నటుడు ప్రకాష్ రాజ్ గొడవకు దిగారు. బుధవారం రాత్రి 7.30 గంటలకు ఆయన శంషాబాద్ అంతర్జాతీయ విమానంలో చెన్నై వెళ్లే ఎయిర్ ఇండియా విమానం ఎక్కారు. తన సీట్లో కూర్చున్న తర్వాత పక్కనే ఉన్న ప్రయాణికుడు ఫొటో తీశాడు. ఈ విషయమై ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.
ఈ క్రమంలోనే ఆగ్రహంతో ఊగిపోతూ ఒకరిపై ఒకరు చేయిచేసుకున్నట్లు సమాచారం. దీంతో ఎయిర్‌లైన్స్ సిబ్బంది జోక్యం చేసుకుని ఇద్దరినీ శాంత పరిచారు. తర్వాత విమానం బయలుదేరింది. కాగా సదరు ప్రయాణికుడు జూనియర్ ఆర్టిస్ట్ అని తెలిసింది.