రైల్లో నుంచి జారిపడి విద్యార్థి మృతి | accidentally a student died in bobbili | Sakshi
Sakshi News home page

రైల్లో నుంచి జారిపడి విద్యార్థి మృతి

Mar 3 2015 11:39 AM | Updated on Sep 17 2018 7:38 PM

రైల్లో నుంచి జారిపడి విద్యార్థి మృతి - Sakshi

రైల్లో నుంచి జారిపడి విద్యార్థి మృతి

ప్రమాదవశాత్తూ రైళ్లోంచి జారిపడి పాలిటెక్నిక్ విద్యార్థి మృతిచెందాడు.

బొబ్బిలి: ప్రమాదవశాత్తూ రైలులో నుంచి జారిపడి ఓ పాలిటెక్నిక్ విద్యార్థి మృతిచెందాడు. ఈ సంఘటన విజయనగరం జిల్లా బొబ్బిలి రైల్వేస్టేషన్‌లో మంగళవారం ఉదయం చోటు చేసుకుంది. బారంగి మండల కేంద్రానికి చెందిన మరడాన కిషోర్(18) విజయవాడ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో మెకానికల్ ఇంజనీరింగ్ రెండో సంవత్సరం చదువుతున్నాడు. గ్రామదేవత పండగ కోసం రైలెక్కిన కిషోర్ ఈరోజు  ఉదయం బొబ్బిలి స్టేషన్‌లో దిగేటప్పుడు ఈ దుర్ఘటన జరిగింది. పూర్తి వివరాలు ఇంకా తెలియరాలేదు.

 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement