రైల్లో నుంచి జారిపడి విద్యార్థి మృతి
బొబ్బిలి: ప్రమాదవశాత్తూ రైలులో నుంచి జారిపడి ఓ పాలిటెక్నిక్ విద్యార్థి మృతిచెందాడు. ఈ సంఘటన విజయనగరం జిల్లా బొబ్బిలి రైల్వేస్టేషన్లో మంగళవారం ఉదయం చోటు చేసుకుంది. బారంగి మండల కేంద్రానికి చెందిన మరడాన కిషోర్(18) విజయవాడ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో మెకానికల్ ఇంజనీరింగ్ రెండో సంవత్సరం చదువుతున్నాడు. గ్రామదేవత పండగ కోసం రైలెక్కిన కిషోర్ ఈరోజు ఉదయం బొబ్బిలి స్టేషన్లో దిగేటప్పుడు ఈ దుర్ఘటన జరిగింది. పూర్తి వివరాలు ఇంకా తెలియరాలేదు.