ఉత్తరాంధ్రలో ఏసీబీ వరుస దాడులు..  | ACB Officials Conducted Raids In Uttarandhra | Sakshi
Sakshi News home page

ఉత్తరాంధ్రలో ఏసీబీ వరుస దాడులు.. 

Feb 4 2020 10:30 AM | Updated on Feb 4 2020 10:39 AM

ACB Officials Conducted Raids In Uttarandhra - Sakshi

సాక్షి, విశాఖపట్నం : ఉత్తరాంధ్రలో మంగళవారం ఏసీబీ అధికారులు వరుస దాడులు చేపట్టారు. విశాఖపట్నం జిల్లా మాకవరం సొసైటీ బ్యాంకు ఉద్యోగి గోవింద ఇంట్లో అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో భారీగా నగదు, విలువైన పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. అలాగే మరో ముగ్గురు బ్యాంకు ఉద్యోగుల ఇళ్లల్లోను అధికారులు సోదాలు జరిపారు. మరోవైపు విజయనగరం జిల్లాలోను ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ట్రైబల్‌ వెల్ఫేర్‌ ఈఈ మోహన్‌రావు ఇంట్లో సోదాలు జరిపారు. అంతేకాకుండా పార్వతీపురం, శ్రీకాకుళం ప్రాంతాల్లో ఏకకాలంలో తనిఖీలు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement