గుంటూరు జిల్లా పెదకూరపాడు మండలం లగడపాడు గ్రామ వీఆర్వో సురేష్ రూ. 3,500 లంచం తీసుకుంటూ సోమవారం ఏసీబీకి చిక్కాడు.
గుంటూరు: గుంటూరు జిల్లా పెదకూరపాడు మండలం లగడపాడు గ్రామ వీఆర్వో సురేష్ రూ. 3,500 లంచం తీసుకుంటూ సోమవారం ఏసీబీకి చిక్కాడు. పట్టాదారు పాస్ పుస్తకం కోసం భాస్కర్‌రావు అనే రైతు వీఆర్వోను సంప్రదిస్తే రూ. 3,500 లంచం ఇవ్వాలని డిమాండ్ చేశాడు. దీంతో రైతు ఏసీబీని ఆశ్రయించాడు. పథకం ప్రకారం రైతు వద్ద నుంచి లంచం తీసుకుంటుండగా వీఆర్వోను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. వీఆర్వో పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
(పెదకూరపాడు)