అనంతపురం జిల్లా మడకశిర మండలం గౌడనళ్లి గ్రామ వీఆర్వో లంచం తీసుకుంటూ ఏసీబీకి దొరికాడు.
మడకశిర: అనంతపురం జిల్లా మడకశిర మండలం గౌడనళ్లి గ్రామ వీఆర్వో లంచం తీసుకుంటూ ఏసీబీకి దొరికాడు. గ్రామానికి చెందిన బాలకృష్ణ అనే రైతు తన భూమికి సంబంధించి పట్టాదారు పాసుపుస్తకం కోసం కొన్ని రోజులుగా తిరుగుతున్నాడు. వీఆర్వో శివప్ప మాత్రం రూ.5 వేలు ఇస్తేనే పని అవుతుందని మెలికపెట్టాడు. దీంతో రైతు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. బుధవారం మధ్యాహ్నం బాలకృష్ణ నుంచి శివప్ప డబ్బులు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు మాటు వేసి పట్టుకున్నారు. వీఆర్వో పై కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.