కిడ్నాప్ కథ సుఖాంతం.. | abducted 5 old boy reached home safley | Sakshi
Sakshi News home page

కిడ్నాప్ కథ సుఖాంతం..

Oct 8 2015 4:14 PM | Updated on May 28 2018 1:37 PM

పశ్చిమగోదావరి జిల్లా తణుకులో కిడ్నాప్ కు గురైన బాలుడి కథ సుఖాంతమైంది.

తణకు: పశ్చిమగోదావరి జిల్లా తణుకులో కిడ్నాప్ కు గురైన బాలుడి కథ సుఖాంతమైంది. రెండు రోజుల కింద పాఠశాలకు వెళ్లి కిడ్నాప్కు గురైన హేమంత్(5)ను ఆగంతకులు గురువారం ఆటోలో వచ్చి ఇంటి వద్ద వదిలి వెళ్లారు.  


హోండా యాక్టివా మీద వచ్చిన ఓ వ్యక్తి చాక్లెట్ ఇస్తానని మభ్యపెట్టి సోమవారం బాలుడిని అపహరించిన విషయం తెలిసిందే. బాలుడి అక్క దుండగుడిని ప్రతిఘటించినా... ఆ చిన్నారిని తోసేసి.. ఈ కిడ్నాప్ కు పాల్పడ్డాడు. కిడ్నాప్ దృశ్యాలను సీసీటీవీ కెమెరా బంధించింది. ఈ దృశ్యాల ఆధారంగా బాలుడి ఆచూకీ కోసం పోలీసులు గత రెండు రోజులుగా తీవ్రంగా గాలించారు. దాంతో భయపడిన ఆగంతకుడు బాలున్ని ఇంటి దగ్గరే వదిలి వెళ్లాడు. తమ కుమారుడు సురక్షితంగా ఇంటికి చేరుకోవడంతో తల్లితండ్రులు ఆనందం వ్యక్తం చేశారు.

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement